NATS వినూత్న సేవ..అమెరికాలో రోడ్డును దత్తత తీసుకున్న సభ్యులు..!!!

తెలుగు రాష్ట్రాల నుంచీ ఎంతో మంది తెలుగు వారు అమెరికాకు వలసలు వెళ్ళారు.అలా వెళ్ళిన వారిలో చాలా మంది వారు వారు వచ్చిన ప్రాంతాల వారిగా అక్కడ స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉండే తెలుగు వారికి అన్ని విధాల అండగా ఉంటున్నారు.

 Nats Innovative Service Members Who Have Adopted The Road In America Nats-TeluguStop.com

అలా ఏర్పాటు చేయబడిందే NATS ( నార్త్ అమెరికా తెలుగు సొసైటీ).తెలుగు బాషాభివృద్దికి అలాగే తెలుగు సంస్కృతిని కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తుంది నాట్స్.

అంతేకాదు తెలుగు పండుగలను నాట్స్ సభ్యులు అందరూ నిర్వహించుకు తెలుగు పండుగల విశిష్టతను చాటి చెప్తుంటారు.అయితే తాజాగా నాట్స్ ఓ వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఊరిని దత్తతు తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో ఎన్నో తెలుగు సినిమాలు వచ్చి భారీ హిట్స్ కొట్టాయి.ఆ సినిమాలకు స్పూర్తి కేవలం విదేశాలలో ఉంటున్న ఎన్నారైలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఎంతో మంది ఎన్నారైలు వారు పుట్టిన ఊర్లను దత్తతు తీసుకుని అభివృద్ధి చేసిన సంఘటనలు లెక్కకు మించే ఉన్నాయి.తాజాగా నాట్స్ అమెరికాలో ఇదే తరహాలో రోడ్డును దత్తతు తీసుకుని వినూత్న సేవా కార్యక్రమానికి తెరలేపింది.

అమెరికాలోని ఫ్లోరిడాలో టెంపాలోని రెండు కిలోమీటర్ల హైవే రోడ్డును దత్తతు తీసుకుంది.ఈ రెండు మైళ్ళ దూరంలో రోడ్డుకు ఇరు వైపులా పచ్చదనం ఉండేలా, రోడ్డుపై ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది.

ఈ కార్యక్రమాని నాట్స్ మాజీ ఛైర్మెన్ శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న హై స్కూల్ పిల్లలతో కలిసి రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించి రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ తరుపున సేవా పత్రాలను అందించారు.భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపడుతామని ఈ ప్రాంత నాట్స్ సభ్యులను స్పూర్తిగా తీసుకుని మరిన్ని ప్రాంతాలలో నాట్స్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నాట్స్ ఛైర్మెన్ శ్రీధర్ కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube