అత్యంత దారుణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన బుల్లితెర నటుడు.. !

ఈ అనంత విశ్వాన్ని అవలీలగా చుట్టేస్తున్న మానవుడు మానసిక ఒత్తిడిని మాత్రం జయించుకోలేక పోతున్నాడు.జీవిత పోరాటంలో గెలుపు వైపు ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తూనే తుది వరకు పోరాడలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నాడు.

 Malayalam Actor Adithyan Jayan Suicide Attempt In Worst Way , Malayala Actor, Ad-TeluguStop.com

ఇక చిత్ర పరిశ్రమలో అయితే ఆత్మహత్యలకు కొదువే లేదు.కాగా తాజాగా కుటుంబ విషయంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు, పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య జయన్, అతి దారుణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కాగా ఆదివారం సాయంత్రం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆదిత్య, త‌న చేతి నరాలను క‌ట్ చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.తీవ్ర ర‌క్త‌స్రావం జరగడంతో అపస్మార‌క స్థితిలోకి వెళ్లి ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య నలిగిపోతున్నాడు.

అయితే ఇతను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన కొందరు త్రిచూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట.ప్రస్తుతం ఆదిత్యకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నామని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇకపోతే ఇటీవల అతని భార్య, బుల్లితెర న‌టి అంబిలి దేవి అతనిపై పలు ఆరోపణలు చేసింది.ఈ క్రమంలో ఆయ‌న సూసైడ్‌ అట్టెంప్ట్ చేయడం సంచ‌లనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube