కరోనా ప్రళయం.. కాళ్లు మొక్కుతా ఈ పుస్తెలు అమ్మి నన్ను బ్రతించండి.. !

ప్రస్తుత కరోనా వల్ల భారత దేశంలో దయనీయమైన పరిస్దితులు తలెత్తాయి.ఒకవైపు ప్రజల అవసరాలకు సరిపడినంత వైద్య సౌకర్యాలు లేకపోవడం.

 A Woman Suffering From Corona Is Worried About Survival Nirmal District, Khanapu-TeluguStop.com

హాస్పటల్ స్టాప్ కూడా అంతంత మాత్రంగా ఉండటం. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, డబ్బులు ఉన్నవాడు మాత్రమే బ్రతికే విధంగా తయారైన ప్రైవేట్ హస్పటల్స్ ఇలా ఎక్కడ చూడు పేదలు దోపిడికి గురవుతు, కరోనా రక్కసి నుండి తప్పించుకో లేక, ప్రాణాలు కాపాడుకోలేక వేదన అనుభవిస్తున్నారు.

బ్రతకాలని ఆశ ఉన్న బ్రతికించే వారు కరువై బ్రతుకులు బరువుగా మారుతుండగా మూగగా రోదిస్తున్నారు.ఇలాంటి విషాద కరమైన ఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో చోటు చేసుకుంది బాదన్‌కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత (40)కు కరోనా అని తెలియడంతో చికిత్స నిమిత్తం నిర్మల్‌ ఏరియా ఆస్పత్రిలో చేరింది.

అక్కడ పట్టించుకునే నాధుడే కరువవడంతో తనను వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలని దీనంగా వేడుకుందట.

మీ కాళ్లు మొక్కుతా, నా వద్ద డబ్బుల్లేవు.

మెడలో ఉన్న పుస్తెలు అమ్మి అయినా సరే నన్ను బతికంచండి.ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.

అంటూనే చివరకు ప్రాణాలు కోల్పోయిందట నిజానికి మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని భ్రమించింది కావచ్చూ, ఈ ప్రపంచంలో ఒక్క మనిషి ప్రాణాలు తప్పా దేన్నైనా ప్రతి సృష్టి చేసే ఘనులు ఇలాంటి పేదవారి పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తారని మరచింది కావచ్చూ.కరోనా ఇంకా తన పై దయచూపుతుందని ఆశించింది కావచ్చూ.

మొత్తానికి ఎవరి నిర్లక్ష్యం అయితే ఏంటి ఈమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube