క్యాన్సర్‌ రోగులకు కోవిడ్ వ్యాక్సిన్‌ సురక్షితమేనా.. ?

కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంతోషించాలో లేక దీని పై జరుగుతున్న ప్రచారాలకు బాధపడాలో, భయపడాలో ఇప్పటికి ప్రజలకు అర్ధం కావడం లేదట.అందుకే ఈ టీకా పై ఎవరు తీర్చలేనన్ని సందేహాలు ఉప్పెనలా వెల్లువెత్తు తున్నాయి.

 Is Covid Vaccine Safe For Cancer Patient Covid Vaccine, Safe, Cancer Patients, R-TeluguStop.com

ముఖ్యంగా వ్యాక్సిన్‌ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతామని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సమస్యలు వస్తాయని ఇలా రకరకాలు అనుమానాలు జనాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా దేశంలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న క్రమంలో ప్రభుత్వం వైరస్‌ నియంత్రణకు తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ను క్రమంగా అన్ని వయస్సుల వారికి అందించే దిశగా అడుగులు వేస్తుంది.

ఇందులో భాగంగా మే 1 నుంచి అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

అయితే ఇప్పుడు మరో అనుమానం కొందరికి కలుగుతుందట.

అసలు క్యాన్సర్‌ రోగులు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా వేసుకున్న తర్వాత ఏమైనా దుష్ఫలితాలు వస్తాయని వెనకముందు ఆడుతున్నారట.అయితే ఈ విషయంలో చీఫ్‌ ఆఫ్‌ రేడియేషన్‌ ఆంకాలజీ, మెడికవర్‌ వైద్యుడు డాక్టర్‌ వినోద్‌ మద్దిరెడ్డి వివరణ ఇస్తూ క్యాన్సర్‌ రోగులు నిరభ్యంతరంగా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, స్పూత్నిక్‌ వీ, ఫైజర్‌, మెడెర్నా మొదలైనవి తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.

అదీగాక కిమోథెరపీ, రేడియేషన్‌ తీసుకుంటున్న వారు ఎప్పుడైనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని, సర్జరీ రోగులు మాత్రమే వ్యాక్సిన్‌ వేసుకునేందుకు, సర్జరీకి ముందు లేదా తర్వాత 7 నుంచి 14 రోజుల వ్యవధి ఉండేలా చూసుకోవాలి తెలియ చేస్తున్నారు.కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ ధైర్యంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube