బాబు స్నేహ ' హస్తం ' ? జగన్ కు ఇబ్బందా ? 

ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యర్ధులు పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు.ఓటమిని ఒప్పుకోరు , అలా అని ఓటమి ఎదురైతే కుంగిపోతూ కూర్చోరు.

 Tdp Chandrababu Try To Alliance On Congress, Aicc , Ap Congress Party , Ap Gove-TeluguStop.com

ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేందుకు , పార్టీని బతికి బట్ట కట్టించేందుకు,  చివరకు రాజకీయ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు.ఆయనకు కావాల్సింది పార్టీ భవిష్యత్తు.

ఎప్పుడూ అదే ఆలోచన తో ఉన్నట్టుుగా కనిపిస్తారు.   2014 ఎన్నికలలో బిజెపి, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి టిడిపి వచ్చింది .కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి టిడిిపిఒంటరి  అయిపోయింది.  ఎవరి మద్దతు లేకుండా పోయింది.

టిడిపి ఆవిర్భావం తరువాత మొట్టమొదటిసారిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయాన్ని టిడిపి చూడాల్సి వచ్చింది. అయితే 2024 ఎన్నికల నాటికి మళ్లీ ఇదే పరిస్థితి కొనసాగితే,  టిడిపి ఎప్పటికీ కోలుకోలేదు అనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.

బిజెపి జనసేన పార్టీలో ఎవరో ఒకరితో  పొత్తు పెట్టుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు .కానీ బిజెపి నేతలు ఎవరు ఒప్పుకోక పోగా,  జనసేన ను కూడా టిడిపి వైపు వెళ్లకుండా కట్టడి చేశారు .దీంతో మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఒకటే.

ఆ పార్టీకి పెద్ద ఎత్తున నాయకులు ఉన్న,  వారంతా ఇప్పుడు స్తబ్దుగానే ఉన్నారు.

మరికొందరు వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.కానీ  అదే కాంగ్రెస్ తో తాము పొత్తు పెట్టుకుంటేే , ఆ పార్టీలోనూ ఉత్సాహం వస్తుందని,  ఆ పార్టీ క్యాడర్ తమకు కలిసి వస్తే ఊహించని విధంగా అధికారం వస్తుందనేది చంద్రబాబు ప్లాన్ గా కనిపిస్తోంది.

  అలాగే వామపక్ష పార్టీలు సైతం తమకు కలిసి వస్తాయని, ఆ విధంగా అయినా  అధికారంలోకి రావచ్చు చు అనేది చంద్రబాబు ఆలోచన అట.

Telugu Aicc, Ap Congress, Ap, Ap Status, Congress, Jagan, Janasena, Lokesh, Chan

 అదీ కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పదే పదే రాహుల్ గాంధీ ప్రకటన చేస్తున్నాడుు.దానికి కట్టుబడి ఉంటాను అంటూ ప్రకటనలు చేస్తున్న క్రమంలో ఇదే అంశంతో ఎన్నికలకు వెళ్లి  ,  సక్సెస్  కావాలన్నది చంద్రబాబు రాజకీయ వ్యూహంం గా కనిపిస్తోంది.కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండడం , ప్రస్తుతం వైసిపి అధినేత జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో,  ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు మద్దతు పలుకుతున్నారని,  టిడిపి ద్వారా కాంగ్రెస్ పుంజుకుంటే, ఆ సామాజిక వర్గం లో చాలా వరకు తమకు కలిసి వస్తుందిి అనేది బాబు ఎత్తుగడగా కనిపిస్తోంది.

ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube