కరోనాతో కకావికలం: భారత్‌కు అండగా టెక్ దిగ్గజాలు.. సాయం ప్రకటించిన సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల

కరోనా వైరస్ కరాళ నృత్యంతో భారతదేశం కనీవినీ ఎరుగని పరిణామాలను చవిచూస్తోంది.ఈ నేపథ్యంలో ఇండియాను ఆదుకునేందుకు ప్రపంచదేశాలన్నీ ముందుకొస్తున్నాయి.

 Microsoft, Google Ceo's Satya Nadella And Sundar Pichai Offer Covid 19 Relief Su-TeluguStop.com

చివరికి మనతో శత్రుత్వమున్న పాకిస్తాన్, చైనాలు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తామని ప్రకటించాయి.తాజాగా భారత్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సుందర్ పిచాయ్‌, స‌త్య నాదెళ్ల‌.

ఇండియాలో పరిస్ధితి హృదయ విదారకంగా వుందన్న సత్యనాదెళ్ల.వాటిని చూస్తుంటే తన మనస్సు ముక్కలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.క్లిష్ట పరిస్ధితిలో భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికా ప్రభుత్వానికి సత్య కృతజ్ఞతలు తెలిపారు.సహయక చర్యల కోసం మైక్రోసాఫ్ట్ కూడా తన గళాన్ని, వనరులను, సాంకేతికతను ఉపయోగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ముఖ్యంగా అత్యవసరమైన ఆక్సిజన్ పరికరాల కొనుగోలు చేయడంలో అండగా వుంటామని సత్యనాదెళ్ల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.అటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం భారత్‌‌కు మద్ధతుగా వుంటామని వెల్లడించారు.గూగుల్, గూగులర్స్ ద్వారా ‘‘గివ్ ఇండియా ’’ పేరిట యూనిసెఫ్‌కు రూ.135 కోట్ట సాయం చేసినట్లు సుందర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు భారత్‌లో పరిస్ధితి ఆందోళనకరంగా వున్నప్పటికీ అమెరికా ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.గోడౌన్లలో మగ్గుతున్న మిగులు టీకాలు, ఇతర వైద్య పరికరాలను భారత్ సహా కోవిడ్‌తో అల్లాడుతున్న దేశాలకు పంపాలని సొంత పార్టీ నేతలు సహా అమెరికాలోని మెజారిటీ వర్గాలు బైడెన్‌పై ఒత్తిడి తెచ్చాయి.

దీంతో తప్పనిసరి పరిస్ధితుత్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇండియాకు అవసరమైన సహకారం అందిస్తామని అధ్యక్షుడు హామీ ఇచ్చారు.వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన వైద్య సామాగ్రి, ఇతర వస్తువులను భారత్‌కు పంపుతామని జో బైడెన్ ప్రకటించారు.

కాగా, భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది.గడిచిన 24 గంటల్లో 3,52,991 మందికి పాజిటివ్‌గా తేలింది.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరుకుంది.ఇదే సమయంలో 2,812 మంది వైరస్‌కు బలయ్యారు.వీటితో కలిపి భారత్‌లో మరణాలు 1,92,123కి చేరుకున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube