సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేమైన గుర్తింపు సొంతం చేసుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ రాశీఖన్నా.ఈ అమ్మడు ప్రతి ఏడాది గ్యాప్ లేకుండా రెండు నుంచి మూడు సినిమాల వరకు చేస్తుంది.
ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ కి జోడీగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో పాటి ఐకాన్ మూవీ సెట్స్ పైకి వెళ్తే రాశీఖన్నాని హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
అలాగే నాగ చైతన్యకి జోడీగా థాంక్యూ సినిమాలో నటిస్తుంది.ఇక తమిళ్ లో అయితే ఆమె నటించిన అరణ్మని3, తుగ్లక్ దర్బార్ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
మలయాళంలో బ్రహ్మం అనే సినిమా కూడా కంప్లీట్ చేసింది.
మేథావి అనే సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ్, తెలుగు బైలింగ్వల్ మూవీ, కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ లో హీరోయిన్ గా ఖరారైంది.తాజాగా సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సినిమా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని సర్దార్ ఫస్ట్ లుక్ సందర్భంగా రాశీ ఖన్నా ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది.
కార్తితో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఇందులో చాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే సర్దార్ సినిమాలో కార్తి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని వినికిడి.