అవికా గోర్ మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ సెకండ్ ఇన్నింగ్ లో మంచి హాట్ లుక్స్ తో ఎంట్రీ ఇచ్చి అందరి హృదయాలని కొల్లగొడుతుంది.అదే సమయంలో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

 Avika Gor Romance With Adi Saikumar, Sai Kumar, Director Bala Veer, Tollywood, J-TeluguStop.com

ఇప్పటికే ఆమె సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి రెండు తెలుగు సినిమాలు చేస్తుంది.అదే సమయంలో థాంక్యూ సినిమాలో చైతూకి చెల్లిగా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

దాంతో పాటు మెగా ఫ్యామిలీ హీరో కళ్యాణ్ దేవ్ మూడో సినిమాలో అవికాగోర్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.ఈ సినిమాతో రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది సాయి కుమార్ కి జోడీగా తన కొత్త సినిమాని అవికా ప్రారంభించింది.తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది.

ఆది సాయి కుమార్ జంగిల్, బ్లాక్, వీరభద్రం చౌదరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ చేస్తూ ఉండగా ఇప్పుడు బాలవీర్ అనే యంగ్ డైరెక్టర్ తో అమరన్ టైటిల్ తో కొత్త సినిమాని లాంచ్ చేశారు.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ఇన్ ది సిటీ చాప్టర్-1 అని పెట్టడం ద్వారా దీనికి సీక్వెల్స్ కూడా ఉండే అవకాశం ఉందని ముందే హింట్ ఇస్తున్నారు.

ఈ మధ్యకాలంలో హిట్ సినిమాలకి సీక్వెల్స్ వస్తున్నాయి.ఈ నేపధ్యంలో దర్శకుడు కామిక్ క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేసుకొని దానికి కొనసాగింపు కూడా రాసుకున్నాడని అనిపిస్తుంది.మరి ఆది కెరియర్ లో చేస్తున్న భిన్నమైన పాత్ర అతనికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube