బిగ్ బాస్ కు అందుకే వెళ్లలేదు.. ఇంద్రజ కీలక వ్యాఖ్యలు..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వస్తే చాలామంది కంటెస్టెంట్లు ఆ అవకాశాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు.అయితే సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మాత్రం తనకు బిగ్ బాస్ షో సీజన్ 4లో పాల్గొనే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేశానని చెబుతున్నారు.

 Heroine Indraja Rejected Bigg Boss Show Season 4 Offer , Bigg Boss Show , Heroin-TeluguStop.com

ప్రస్తుతం బుల్లితెర షో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమిత సంఖ్యలో సినిమాలు చేస్తున్న ఇంద్రజ తన కుటుంబం చెన్నైలో ఉంటుందని వాళ్లను వదిలి బిగ్ బాస్ షోకు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆ షోలో పాల్గొనే ఆఫర్ ను రిజెక్ట్ చేశానని చెప్పారు.

రాబోయే సీజన్లలో తనకు ఛాన్స్ వచ్చినా ఆ షోకు వెళ్లే ఉద్దేశం లేదని ఇంద్రజ తేల్చి చెప్పారు.అయితే బిగ్ బాస్ షోకు అతిథిగా హాజరు కావడానికి మాత్రం తనకు అభ్యంతరం లేదని ఆమె వెల్లడించారు.

Telugu Bigg Boss Show, Indraja, Season, Telugu-Movie

బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జునను చూడటానికి తాను ఆ షోకు వెళతానని ఆమె పేర్కొన్నారు.బిగ్ బాస్ షోను నాగార్జున బాగా హోస్ట్ చేస్తున్నారని ఆయనతో కొంత సమయం మాట్లాడటానికి ఆ షోకు గెస్ట్ గా వెళతానని ఇంద్రజ తెలిపారు.హలోబ్రదర్ సినిమాలో నాగార్జునతో కలిసి ఒక పాట చేశానని ఆ అనుభవాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ షో సీజన్ 3, సీజన్ 4లకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా సీజన్ 5కు కూడా నాగార్జున హోస్ట్ అని తెలుస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతుండగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube