ఇండియన్ 2పై అలా క్లారిటీ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ నిర్మాతల మధ్య గత కొంత కలంలో ఇండియన్ 2 సినిమా విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి ఆరంభం నుంచి ఏదో ఒక రూపంలో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి.

 Madras High Court Decision Declared On Indian 2 Movie, Kollywood, Director Shank-TeluguStop.com

అయితే ఫైనల్ గా దర్శకుడు చెప్పిన బడ్జెట్ దాటిపోవడంతో నిర్మాతలు కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు.అయితే ఇంతలో శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవ్వడంతో వారు కోర్టుకి ఎక్కారు.

తమ ప్రొడక్షన్ లో ఇండియన్ 2 పూర్తి చేయకుండా మరో సినిమా స్టార్ట్ చేయకూడదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై హై కోర్టు దర్శకుడు శంకర్ నుంచి వివరణ అడిగింది.

ఇండియన్ 2 మూవీ ఇప్పటికే 80 శాతం పూర్తయిపోయిందని, ఇంకా 20 శాతం మాత్రమే పెండింగ్ ఉందని వివరణ ఇచ్చారు.

దీనిపై హైకోర్టు తాజాగా తీర్పు చెప్పి సినిమా విషయంలో దర్శకుడు, నిర్మాత ఇద్దరూ కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించింది.

అయితే అగ్రిమెంట్ ప్రకారం చెప్పిన బడ్జెట్ దాటిపోవడంతో తాము ఒక్క రూపాయి కూడా అదనంగా పెట్టమని నిర్మాతలు తేల్చేశారు.దీంతో దర్శకుడు శంకర్ మిగిలిన భారం అంతా భరించి సినిమాని పూర్తి చేసే బాద్యత తీసుకోవాలి.

అయితే హైకోర్టు తీర్పు ప్రకారం ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో శంకర్ పూర్తి చేసి తీరాలి.ఈ నేపధ్యంలో త్వరలో అన్ని సెట్ చేసుకొని ఇండియన్ 2 మూవీ మిగిలిన 20 శాతం పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ విషయంలో నిర్మాతలు ఏమైనా కాంప్రమైజ్ అయ్యి బడ్జెట్ విషయంలో సహకరించే అవకాశం ఉందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube