రిలాక్స్ మూడ్ లో మంత్రులు ? 

పరిపాలనా పరమైన విషయం పైనే నిత్యం ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టి తీరికలేకుండా పని చేస్తూ ఉంటారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసినా, చేయకపోయినా,  ఏపీలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

 Some Ap Ministers Resting In Different Areas, Ap Government , Cabinet , Electio-TeluguStop.com

అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ,  ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు.జగన్ కు ఉన్న ఆ నిబద్ధత కారణంగానే, ఏపీ అన్ని రంగాల్లోనూ ముందు ఉంటూ , దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

అలాగే డైనమిక్ సీఎం గా జగన్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.అయితే ఇదంతా జగన్ ఒక్కడి క్రెడిట్ మాత్రమే కాదు.

దీనికి అధికారులు, మంత్రులు, పార్టీ నాయకులు , ఇలా అందరి సహకారం తోనే ఇది సాధ్యం అవుతోంది.అయితే ఇప్పుడు ఏపీ మంత్రుల్లోని చాలా మందిలో చురుకుదనం లోపించిందట.

 తమ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసిందని, ఇక పెద్దగా చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.ఏపీలో స్థానిక సంస్థలు , మున్సిపల్,  పరిషత్,  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు, ఇలా అన్ని ఎన్నికల తంతు పూర్తి కావడంతో,  వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారట.

ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కు సంబంధించి చాలామంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.ఈ లోక్ సభ పరిధిలో ప్రచార కార్యక్రమాలను మంత్రులకు జగన్ అప్పగించారు.

అయితే కొంత మంది మంత్రులు ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం కోసం గట్టిగా కష్టపడినా , కొంతమందికి మాత్రం తూతూమంత్రంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో చాలా మంది మంత్రులు ఇప్పుడు ఏపీలో అందుబాటులో లేకుండా ఇతర ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకున్నట్లు జగన్ వరకు ఫిర్యాదులు వెళ్లాయట.

Telugu Ap, Jagan, Ministers, Mlas, Ysrcp-Telugu Political News

దీంతో ఎవరెవరు మంత్రులు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు అనే విషయం పైన జగన్ ను ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.కొంతమంది మంత్రులు మాత్రం తమ సొంత నియోజకవర్గంలనే అందుబాటులో ఉంటూ,  ప్రభుత్వంపై టిడిపి చేసే విమర్శలకు సరైన సమాధానం చెబుతూ,  తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారట.త్వరలోనే ఏపీ కేబినెట్ ప్రక్షాళన చేసే ఆలోచనలో జగన్ ఉండడంతో, తమ మంత్రి పదవులకు ఎటువంటి డోకా లేకుండా ముందస్తుగా కొంతమంది మంత్రులు అలెర్ట్ గా ఉంటున్నారట.కానీ చాలా మంది మంత్రులు నిర్లక్ష్యంగా ఉండడం పైనే జగన్ వారి పై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube