అసలే ఎండాకాలం ఒకవైపు మండుటెండలు, మరోవైపు దాహంతో చాలా మంది ప్రజలు, వన్య ప్రాణులు, ముగ జీవాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలో పాపం ఒక కుక్క కు బాగా దాహం వేసింది.
అది దాహం తీర్చుకునేందుకు ఒక ఇంటి పెరట్లో బిందెలో నీళ్ళు చూసి దాహం తీర్చుకుందామని అక్కడకు వెళ్లి ఇరుక్కుపోయింది.ఇక అప్పటి నుంచి అది చాలా ఇబ్బంది ఎదురయ్యింది.
ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే .ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెంలో ఒక కుక్కకు అనుకోకుండా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.బాగా మండు ఎండలో అది దాహం తీర్చుకునేందుకు అక్కడ ఇక్కడ తిరుగుతూ అలసిపోయి చివరకు నీళ్లు తాగుదామని ఒక ఇంటి పెరట్లో ఉండే బిందెలో నీళ్లను చూసి అక్కడికి వెళ్ళింది.
ఇప్పటి వరుకు అంతా బాగానే ఉంది, నీళ్లు కూడా తాగేసింది కానీ ఇక ఆ బిందె నుంచి తల తీద్దామా అంటే బయటకు రావడం లేదు.ఆ బిందెలో నుంచి తన తల బయటికి తీయడానికి అది చాలా ఇబ్బందులు పడింది.
ఇక ఆ కుక్క పడుతున్న ఇబ్బందులను చూసిన అక్కడి స్థానికులు వెంటనే ఒక తాడు సహాయంతో దానికి విముక్తి కలిగించారు.ఆ కుక్క మెడకు తాడు వేసి గట్టిగా లాగడంతో కుక్క తల బిందెలో నుంచి బయటికి వచ్చింది.
దీంతో ఒక్కసారిగా ఆ కుక్కకు ఉపశమనం లభించినట్లు అయింది.ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.