రామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పరిచయం అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల్లో నటించి యంగ్ స్టార్ హీరో గా గుర్తింపు పొందాడు.

 Geneilia, Ram Movie, Tollywood, Re Entry , Tollywood, Orange Movie-TeluguStop.com

దేవదాసు సినిమా ద్వారా తొలిసారిగా పరిచయమైన హీరో రామ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలతో అవకాశాలను అందుకుంటూ బిజీ గా మారాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ మరో సినిమాలో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వనుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

2008లో విడుదలైన రామ్ నటించిన సినిమా రెడీ.ఈ సినిమాలో రామ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించుకుంది.

ఇదిలా ఉంటే జెనీలియా మళ్లీ రామ్ సరసన నటించనుంది.

Telugu @geneliad, Geneilia, Ram, Tollywood-Movie

రామ్ ప్రస్తుతం నటించబోయే సినిమాల్లో జెనీలియా కూడా నటించనుందట.కానీ ఇందులో జెనీలియా హీరోయిన్ పాత్రలో కాకుండా మరో ముఖ్యమైన పాత్రలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జెనీలియా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించగా తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా రామ్ చరణ్ తో నటించిన ఆరంజ్ సినిమా మాత్రం తనకు అంతా గుర్తింపు ఇవ్వలేకపోయింది.

ఇక 2012లో రానా నటించిన నా ఇష్టం సినిమా లో హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ లో జెనీలియా ఈ సినిమాతోనే చివరి గా నటించింది.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ గా మారింది.ఇక మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత జెనీలియా రామ్ తో కలిసి నటించడానికి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రామ్ వరుస ప్రాజెక్టులో ఆఫర్లు సొంతం చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube