ప్రపంచంలోనే అతి చిన్న శ్రీరాముని విగ్రహం తయారు చేసిన భారతీయ కళాకారుడు..!

దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ సందర్బంగా కరోనా వైరస్ పుణ్యమా అంటూ చాలా కొద్ది మొత్తంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు.పండుగ సందర్భంగా ఒడిశాకు చెందిన ఒక కళాకారుడు ప్రపంచంలోనే అతి చిన్న రాముడు విగ్రహాన్ని రూపొందించి వార్తల్లో నిలిచాడు.

 Indian Artist Makes The Smallest Statue Of Lord Rama In The World, Smallest Rama-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే.ఒడిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ సత్యనారాయణ మహారాణా మోహరానా చెక్క సహాయంతో అతిచిన్న రాముడి విగ్రహాన్ని సులువుగా చెక్కారు.

వాస్తవానికి రాముడు అంటే అందానికి ప్రతిరూపం.అటువంటి అందాల రాముడిని కళాకారుడి చేతిలో అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు.

ఈ సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ సత్యనారాయణ మాట్లాడుతూ.” తాను తయారు చేసిన రాముడు విగ్రహం ఎత్తు కేవలం 4.1 cm అని తెలుపుతూ ఉన్నాడు.ప్రపంచంలోని ఈ విగ్రహం అతి చిన్న రాముడు విగ్రహం అని ఆయన పేర్కొన్నాడు.

ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ చిన్న రామయ్యను తయారు చేశానని, అలాగే ఈ విగ్రహ తయారీకి కేవలం ఒక గంట సమయం పట్టిందని ” సత్యనారాయణ తెలిపారు.ఈ విగ్రహాన్ని తయారుచేయడంతో సత్యనారాయణ మైక్రో ఆర్టిస్టుగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు.

ఇలా మైక్రో ఆర్టిస్ట్ గానే కాకుండా  శాండ్ ఆర్ట్ తో  కూడా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.ఇది ఇలా ఉండగా శివరాత్రి పండుగ సందర్భంగా చెక్కతో పాటు రాతితో చిన్న చిన్న శివ విగ్రహాలను తయారుచేసి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

చెక్క సహాయంతో 5 మిల్లీమీటర్ల పొడవు గల శివయ్య విగ్రహాన్ని, అలాగే రాతితో 7 మిల్లీ మీటర్ల పొడవు శివయ్య విగ్రహాన్ని తయారు చేశాడు.అలాగే ఈ క్రమంలో ” కరోనా వైరస్ కారణంతో ప్రజలు ఇళ్ళల్లో ఈ చిన్న రాముడు విగ్రహం ఉండటం శ్రేయస్కరం అని, ఆలయాలకు కూడా వెళ్లొద్దని ఇంట్లో ఉండే శ్రీరాముని ప్రార్థించండి” అంటూ సత్యనారాయణ ప్రజలను కోరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube