తెలుగు వాళ్ళం గర్వపడేలా..అమెరికాలో భారీ నిర్మాణానికి శ్రీకారం..!!!

తెలుగువారందరూ ఎంతో గర్వపడే విషయం ఇది.ఎంతో మంది తెలుగు వాళ్ళు అగ్ర రాజ్యం అమెరికాలో స్థిరపడిన విషయం విధితమే భారత దేశం నుంచీ ఎంతో మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్ళగా వారిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉండటం గమనార్హం.

 Let The Telugu People Be Proud The Beginning Of A Huge Construction In America,-TeluguStop.com

అయితే ఏ దేశం వెళ్ళినా తెలుగు ఖ్యాతిని, తెలుగు సంస్కృతి, తెలుగు పండుగలను అంగరగ వైభవంగా నిర్వహించడంలో మన వాళ్ళు ముందుంటారు.అంతేకాదు అక్కడి పాశ్చాత్య సంస్కృతికి తమ పిల్లలు అలవాటు పడినా మన తెలుగు బాషను, సంస్కృతిని పిల్లకు నేర్పుతూ ఎంతో మందికి స్పూర్తివంతగా నిలుస్తున్నారు.

తాజాగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ లో ఉండే వేలాది మంది తెలుగు ప్రవాసులు అందరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ కు రూప కల్పన చేశారు.తెలుగు వారందరూ గర్వపడేలా ఈ ప్రాజెక్ట్ రూపు దిద్దుకుంటుందని, అగ్ర రాజ్యంలో తెలుగు వెలుగులకు ఈ ప్రాజెక్ట్ మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హ్యూస్టన్ లో దాదాపు 35 ఎకరాలలో తెలుగు భవనం నిర్మించడానికి మహా యజ్ఞం చేస్తున్నారు అక్కడి మన తెలుగువాళ్ళు.తెలుగు జాతి చరిత్ర ప్రతీ ఒక్కరికి తెలిసేలా ఈ నిర్మాణం ఉంటుందని తెలిపారు.

ఈ 35 ఎకరాలలో క్రీడల కోసం అతిపెద్ద స్థలాన్ని కేటాయించారు.వ్యవసాయం చేయడానికి కూడా వీలు ఉండేలా ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు.

హ్యుస్టన్ లో ఉన్న తెలుగు వారు మరికొందరు దాతల సాయంతో ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ సిద్దమవుతోందని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో గర్వపడేలా రూపుదిద్దుకుంటుందని తెలుగు బాష అభివృద్ధి కోసం కృషి చేసిన వారి సూచనలు సలహాల మేరకు నిర్మాణాలను చేపడుతున్నారు.

భూమి పూజ చేసి నిర్మాణ పనులను మొదలు పెట్టామని, అమెరికాలోని పలు ప్రాంతాల తెలుగు వాసులు కొందరు నిర్మాణానికి నిధులు అందిస్తున్నారని ఈ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube