పుష్పతో జాయిన్‌ అయిన రంగమ్మత్త

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్‌ గా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా షూటింగ్‌ చక చక జరుగుతోంది.కరోనా సెకండ్‌ వేవ్‌ తో కేసులు ఉదృతంగా నమోదు అవుతున్నా కూడా సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్‌ ను దర్శకుడు సుకుమార్‌ నిర్వహిస్తున్నాడు.

 Anasuya Joins In Pushpa Movie Shooting , Allu Arjun, Anasuya, Anasuya In Pushpa-TeluguStop.com

సినిమా ను అనుకున్నట్లుగా ఖచ్చితంగా ఆగస్టులో విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.అందుకు సంబంధించిన చిత్రీకరణ పనులు చకచక జరుగుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమా కోసం హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.షూటింగ్ లో అనసూయ పాల్గొంటున్నట్లుగా కూడా యూనిట్‌ సభ్యుల ద్వారా వార్తలు వస్తున్నాయి.

రంగస్థలం సినిమాలో కీలక పాత్రను పోషించిన అనసూయ ఇటీవల పుష్ప సినిమా లో నటిస్తున్నారా అంటూ ప్రశ్నించగా లేదు అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.కాని తాజాగా పుష్ప షూటింగ్‌ లో ఆమె జాయిన్‌ అవ్వడం కాస్త ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

అసలు నిజంగా పుష్ప సినిమాలో అనసూయ ఉందా లేదా అనే విషయమై ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.రంగస్థలం సినిమా లో తీసుకుని ఆ వెంటనే ఈ సినిమా లో కూడా అనసూయను పుష్ప లో సుకుమార్‌ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా అది అద్బుతం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆమె యొక్క ట్యాలెంట్‌ నేపథ్యంలో పుష్ప లో చిన్న పాత్ర ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసి మరీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అల్లు అర్జున్ కూడా అనసూయ అంటే ప్రత్యేకమైన అభిమానంను కనబర్చుతూ ఉంటారు.

అందుకే ఆమెను ఈ సినిమా లో నటింపజేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube