తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్..!!

ఇటీవల ఏప్రిల్ 17వ తారీఖున తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఉప ఎన్నికలలో వైసిపి పార్టీ అడ్డదారులు తొక్కుతూ దొంగ ఓట్లు వేయించింది అంటూ బిజెపి టిడిపి పార్టీలు నుండి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.

 Ratna Prabha Petition In High Court To Cancel Tirupati By Election , Bjp, Ratna-TeluguStop.com

అంతేకాకుండా ఆ రెండు పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వెబ్ సైట్ లలో దొంగ ఓట్లు వేసిన ఓటర్ల వీడియోలు తీసి పోస్ట్ చేసి మరీ వైరల్ చేశారు.ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా వైసిపి పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆడియో టేప్ ఒకటి బయటకు రావటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.ఈ క్రమంలో బిజెపి పార్టీ అభ్యర్థి రత్నప్రభ .

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని మళ్లీ పోలింగ్ నిర్వహించాలని తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు.ఉప ఎన్నికల పోలింగ్ లో భారీగా అక్రమాలు జరిగాయని వాటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పిటిషన్ లో తెలిపారు.

ఈ పిటిషన్ లో  రత్నప్రభ ప్రతివాదులుగా ఎన్నికల సంఘంతో పాటు వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని అదేవిధంగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ని చేర్చడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube