ఓ పెద్ద దర్శకుడు తనని ఇప్పటికి వేధిస్తున్నాడు అంటున్న బాలీవుడ్ హీరోయిన్

కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బాలీవుడ్ లో ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాలు, వేధింపుల గురించి మీటూ ఉద్యమం ద్వారా మీడియాతో పంచుకున్నారు.

 Prachi Desai On Casting Couch Experience, Tollywood, Metoo, Bollywood Heroines,-TeluguStop.com

తనుశ్రీదత్తా నుంచి చాలా మంది తారలు మీడియా ముందుకి వచ్చి లైంగిక వేధింపుల గురించి మీడియాలో నోరు విప్పారు.కొంత మంది తమని వేధించిన వారి పేర్లు కూడా బయట పెట్టారు.

మరికొందరు తనకి ఎదురైనా అనుభవాలని మాత్రమే పంచుకున్నారు.హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించే సమయంలో దర్శక, నిర్మాతల నుంచి ఎలాంటి వేధింపులు ఎదురయ్యాయి అనే విషయాలు చెప్పుకున్నారు.

స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా తన కెరియర్ ఆరంభంలో కొన్ని వేధింపులని పేస్ చేసినట్లు చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా తనకి ఎదురవుతున్న వేధింపులపై నోరు విప్పింది.

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ తన కెరీర్లో ఎదురైన కాస్టింగ్ కౌచ్ విషయాన్నీ బయటపెట్టింది.కెరీర్ ప్రారంభంలో ఓ పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది.కానీ ఆ దర్శకుడు నన్ను కంప్రమైస్ కావాలని అడిగాడు.అందుకు నేను నిరాకరించి ఆ సినిమా వదిలేసాను.

కానీ ఆ దర్శకుడు మాత్రం నన్ను వదలడం లేదు.ఇప్పటికి కూడా తనని వేధిస్తూనే ఉన్నాడు.

అవకాశాల పేరుతో గాలం వేస్తూ తనని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకొచ్చింది.అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయం మాత్రం ప్రాచీ దేశాయ్ క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ సైలెన్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube