దేశంలో మళ్లీ లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక కామెంట్స్..!!

ప్రధాని మోడీ జాతినుద్దేశించి తాజాగా ప్రసంగించడం జరిగింది.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందని.

 Narendra Modi Clarification On Lock Down, Modi , Lock Down , Corona Second Wave,-TeluguStop.com

ప్రధాని మోడీ అన్నారు.కానీ దేశంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలని సూచించారు.కాబట్టి దేశాన్ని లాక్ డౌన్ నుండి ప్రజలే కాపాడాలని.

కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.ఈ క్రమములో యువకులు స్వచ్ఛందంగా.

కరోనా నిబంధనలు అమలయ్యేలా బాధ్యత వహించాలని సూచించారు.  ఇదే క్రమంలో.

వైద్యం అందిస్తున్న సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నట్లు మోడీ స్పష్టం చేశారు.

మరోసారి ఈ మహమ్మారి తో యుద్ధం చేస్తున్నామని .ఎవరు ధైర్యం కోల్పోకూడదు అని సూచించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ఈ దిశగా కృషి చేస్తుంది అని స్పష్టం చేశారు.

ముఖ్యంగా దేశంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని ఈ క్రమంలో ఆక్సిజన్ ప్రత్యేక ట్రైన్స్.దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీర్చు తాయి అని తెలిపారు.అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి మాసంలో పోలిస్తే ఇప్పుడు మందుల ఉత్పత్తి చాలా రెట్లు పెంచినట్లు మోడీ స్పష్టం చేశారు.

దేశంలో మందుల విషయంలో ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని.

ప్రపంచంలోకెల్లా మన దేశం లో అత్యంత శక్తివంతమైన ఫార్మా సెక్టార్ ఉందని పేర్కొన్నారు.అందువల్ల అతి తక్కువ టైమ్ లోనే వ్యాక్సిన్ తయారు చేసుకోవడం జరిగిందని.

ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వ్యాక్సిన్లను అనుమతులు ఇచ్చినట్లు మోడీ స్పష్టం చేశారు.అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం దేశంలో జరుగుతుందని తెలిపారు.

 మే ఫస్ట్ నుండి 18 సంవత్సరాలు పైబడిన యువకులకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు మోడీ తెలిపారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికిపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని అన్నారు.

 ఏది ఏమైనా దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టే ఉద్దేశం లేదని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube