నాని శివ నిర్వాణకు మొహమాటం కొద్దీ ఓకే చెప్పాడట..!

న్యాచులర్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టక్ జగదీష్.ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుంది.

 Hero Nani Shares Interesting News About Tuck Jagadish Movie, Nani, Shiva Nirvana-TeluguStop.com

ఈ సినిమా గురించి తాజాగా ఒక విషయం చెప్పాడు నాని.శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ఇంతకు ముందు నిన్ను కోరి సినిమా చేసాడు.

ఈ సినిమా నాని సినిమాల్లో ఒక బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు.

ఈ సినిమా తర్వాత మళ్ళీ శివ నిర్వాణ తో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా విషయంలో నాని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.ఈ సినిమా కథ చెప్పడానికి శివ నిర్వాణ నాని ని కలుస్తానంటే నాని మొహమాటం కొద్దీ ఓకే చెప్పాడట.

నిజానికి నాని ఈ సినిమా చేయాలనీ అనుకోలేదట.శివ నిర్వాణ కథ చెప్పగానే నో అని చెప్పాలని నాని ముందుగానే ఫిక్స్ అయ్యాడట.

Telugu Corona Effect, Nani, Natural Nani, Ritu Varma, Shiva Nirvana, Tuck Jagadi

ఎందుకంటే ఆ సమయంలో నాని కి లవ్ స్టోరీ లపై ఆసక్తి లేదట.శివ నిర్వాణ మరొక ప్రేమ కథతోనే నా ముందుకు వస్తదనుకున్నా.అందుకే ఈ సినిమాకు నో చెప్పాలనుకున్నా.కానీ శివ టక్ జగదీష్ సినిమా కథ చెప్పగానే ఏం చెప్పకుండా వెంటనే ఓకే చెప్పా.అని నాని చెప్పాడు.విభిన్న మైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న సమయంలో శివ నిర్వాణ టక్ జగదీష్ గురించి చెప్పాడు.

అందుకే వెంటనే ఓకే చెప్పా అని తెలిపాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇందులో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను ఏప్రిల్ 23 న రిలీజ్ చెయ్యాలని అనుకున్నా కరోనా కారణంగా వాయిదా వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube