బిడెన్ పై ట్రంప్ ప్రశంసలు...షాక్ లో రిపబ్లికన్ పార్టీ..!!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.ఇద్దరి నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గు మనే పరిస్థితులు ఉన్న నేపధ్యంలో తాజాగా ట్రంప్ తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

 Trump Praises Biden Republican Party In Shock, Biden, Trump, Obama, Bush, Americ-TeluguStop.com

ఇంతకీ ట్రంప్ బిడెన్ పై ఎందుకు ప్రశంసలు కురిపించాడు.అంతగా బిడెన్ ఏం చేశాడు అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికా సుదీర్ఘంగా ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా బలగాలను మొహరిస్తూ తమ ఆధీనంలోకి ఉంచుకున్న తరుణంలో తాజాగా బిడెన్ తన సేనలను వెనక్కి పిలవడం, పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ ఓ అమెరికా బలగాలను ఉండనివ్వనని ప్రకటించడమే ట్రంప్ సంతోషానికి ప్రధాన కారణం.

అయితే బిడెన్ నిర్ణయం సంతోషంగా ఉందని అంటూనే తన అక్కసు కూడా వెళ్ళగక్కారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచీ బలగాలను వెనక్కి రప్పిస్తున్నారు ఇది ఎంతో అద్భుతమైన విషయం సందేహం లేదు కానీ అందుకు విధించిన గడువు మాత్రం సంతృప్తి కరంగా లేదని అన్నారు ట్రంప్.సెప్టెంబర్ వరకూ ఆగాల్సిన అవసరం మనకు లేదని, మే మొదటి వారం లోనే సేనలను వెనక్కి వచ్చేయచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.

కానీ సెప్టెంబర్ 11 వరకూ బిడెన్ గడువు వద్దని ట్రంప్ అనడానికి రెండు కారణాలు ఉన్నాయట అవేంటంటే.సెప్టెంబర్ 11 అనేది అమెరికాకు అత్యంత విషాదకరమైన రోజు ఆ రోజున ఎంతో మందిని అమెరికా కోల్పోయింది ఆ రోజున ఈ చర్యలు వద్దని అంటున్నారు.

ఇక రెండవ కారణం.అమెరికా సేనలను ఆఫ్ఘనిస్తాన్ లో మొహరించి 19 ఏళ్ళు అవుతోంది.

మరింత సమయం అవుతుందనే కారణంగానే గడువు కంటే ముందుగానే చర్యలు చేపట్టాలని కోరారు.ఇదిలాఉంటే మరో పక్క బిడెన్ తీసుకున్న నిర్ణయంతో ఒబామా, బుష్ లు సైతం సంతోషం వ్యక్తం చేయగా ట్రంప్ కూడా ఈ లిస్టు లో ఉండటంతో రిపబ్లికన్ నేతలు ట్రంప్ ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు.

ట్రంప్ బిడెన్ ను మెచ్చుకోవడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని, బిడెన్ నిర్ణయం లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా ఉందని ఏ మాత్రం సానుకూల నిర్ణయం కాదని అంటున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube