రేప్ కేసులో భాగంగా యూట్యూబ్ ఫేమ్ భార్గవ్ అరెస్ట్..?!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో  సోషల్ మీడియాలో రాత్రికి రాత్రియే స్టార్స్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు.

 Youtube Fame Bhargav Arrested As Part Of Rape Case, Rape Case, Bhargav, Youtube-TeluguStop.com

ఇటీవల యూట్యూబ్ స్టార్స్ గా పేరు పొందిన వారు చాల మంది మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన వారిలో ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ కూడా ఒకరు.అయితే తాజాగా ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసులో అరెస్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.14 సంవత్సరాలు గల మైనర్ బాలికపై రేప్ చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్ ను  పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో భార్గవ్ ని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు భార్గవ్ పై పోక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్స్ అబ్యూస్)చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఈ విషయాని సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయంగా ఉన్న శివ తెలియచేశాడు.

ఐతే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అన్న విషయంపై ఇంతవరకు స్పష్టంగా తెలియడం లేదు.ఏదైనా సోషల్ మీడియాలో ప్రమోషనల్ స్టార్స్ వారి ఫేం పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఇలా పోస్టులు పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు కొందరు వాపోతున్నారు.

వాస్తవానికి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి సున్నితమైన విషయాలను ఉపయోగించడం చాలా తప్పు అని కొంతమంది వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు.శివ పోస్ట్ సోషల్ మీడియా లో పెట్టాడు అంటే అది నిజమైన వార్త కావచ్చు అని కొంతమంది కామెంట్స్ కూడా పెడ్తున్నారు.

ఈ వార్తలే నిజమైతే ఫన్ బకెట్ భార్గవ్ అతి పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లు,  అంతేకాకుండా పోక్సో చట్టం కింద కేసు నమోదు అవడంతో ఆ కేసు నుంచి బయటపడటం అంత సులువైన విషయం కాదని మాచారం.ఇక భార్గవ్ టిక్ టాక్ వీడియోలతో అలాగే యూట్యూబ్ కామెడీ షో ఫన్ బకెట్ ద్వారా నెటిజన్స్,  ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube