మీ వైఫై రూటర్ సరిగా పని చేయట్లేదు అనిపిస్తుందా..?! అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని బహుళజాతి కంపెనీలు వారి ఉద్యోగులను ఇంటినుంచే పని చేయడానికి వీలును కలిపిస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే.అయితే ఇందులో భాగంగా చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే ఉండి వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

 Tips To Increase Wifi Router Internet Speed , Wifi Router, Speed, Slow, Tips To-TeluguStop.com

ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే అనేక రంగానికి చెందిన వారు ఇంటి వద్ద నుండి పని చేయడంతో చాలా మంది ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని వాటిని వైఫై రూటర్ లకు మార్చుకుంటున్నారు.అయితే ఇలా అమర్చుకున్న తర్వాత కొందరికి వైఫై నుండి ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ గా ఉండకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ సమస్యని నుండి బయట పడాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అయిపోతే వైఫై నుండి వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.మరి ఆ ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దామా.

మీ ఇంట్లో ఉన్న వైఫై స్పీడ్ బూస్ట్ అప్ చేయాలంటే మొదటగా చేయాల్సిన పని ఒక్కసారి మీ వైఫై రూటర్ ని టర్న్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి ఆ తర్వాత మరోసారి మీ ఇంటర్నెట్ కనెక్టివిటీని చెక్ చేసుకోండి.ఇలా ఆఫ్, ఆన్ చేయడం ద్వారా మోడం ఇంటర్ నెట్ సిగ్నల్స్ అలాగే కనెక్టివిటీ సెంటర్ మధ్య సిగ్నల్స్ ను కలపడంతో వైఫై స్పీడ్ ఒక్కసారిగా పెరగడానికి ఆస్కారం ఉంది.

ఇంకొక మార్గం ఏమిటంటే.మీ వైఫై రూటర్ లో ఏదైనా సమస్య ఉందో లేదో ఒకసారి చెక్ చేసి వీలయితే మీ వైఫై రూటర్ మార్చుకోవడం బెస్ట్ ఆప్షన్.

అంతేకాకుండా వీలైతే వైఫై రూటర్ ఉన్న ప్రదేశాన్ని మార్చడం కూడా ఓ సులువైన పద్ధతి.ఎందుకంటే సిగ్నల్స్ వచ్చే చోట గోడ లేకపోతే ఫర్నిచర్ లాంటివి వస్తువులు అడ్డంగా ఉంటే సిగ్నల్ లాంటివి రావడం కాస్త కష్టంగా ఉంటుంది.

Telugu Corona Wave, Signals, Speed, Slow, Tips Speed, Wifi Networks, Wifi Router

ఇవి కాకుండా వైఫై రూటర్ యొక్క ఫ్రిమ్ వేర్ ను అప్డేట్ చేసుకోవడం కూడా ఈ సమస్యకు పరిష్కారంగా చెప్పవచ్చు.వీటితో పాటు మీ వైఫై రూటర్ ఒక యంటీనా ని కూడా సరిగా లేకపోయినా మనకు వైఫై నుంచి వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడానికి ఆస్కారం వుంటుంది.కాబట్టి మీ వైఫై స్పీడ్ ను పెంచుకోవాలంటే వెంటనే మీరు రూట్ అని ఒక యాంటీనా ని కూడా సరిగ్గా సెట్ చేసుకోవడం ఓ మార్గం.ఇలా వివిధ రకాలుగా వైఫై రూటర్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube