ఎమోషనల్ అయిన కాజల్ అగర్వాల్.. బేరాలు వద్దంటూ..?

భారత్ లో ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.సెకండ్ వేవ్ లో నమోదవుతున్న కేసుల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.

 Heroine Kajal Agarwal Interesting Comments About Corona Virus, Corona Virus, In-TeluguStop.com

తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి ప్రముఖులకు సైతం కరోనా సోకిన సంగతి తెలిసిందే.గతేడాది వేసవిలో విజృంభించిన ఈ వైరస్ ఈ ఏడాది కూడా వేసవిలోనే విజృంభించడం గమనార్హం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది.కరోనా మహమ్మారి కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కు కీలక సూచనలు చేశారు.

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా కరోనా వైరస్ తో బేరాలు వద్దని.కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.కాజల్ తన పోస్ట్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల ప్రపంచం భయానకంగా మారిపోయిందని పేర్కొన్నారు.

సహనం, ఆరోగ్యానికి ఈ వైరస్ పరీక్ష పెడుతోందని కాజల్ అగర్వాల్ వెల్లడించారు.వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల ప్రపంచం ప్రమాదకరంగా మారిందని ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు.కరోనా ఊహించిన విధంగా మన ముందుకు రాదని వైరస్ తన రూపాన్ని మార్చుకుంటుందని విషాదంతో బేరాలు ఆడితే మనం బాధ పడాల్సి ఉంటుందని ఆ భాధ మనకే తప్ప గ్రహాంతరవాసికి కాదని ఆమె వెల్లడించారు.

కాజల్ అగర్వాల్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఈ పోస్ట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కాజల్ సెటైరికల్ గా కరోనా గురించి అభిమానులకు కీలక సూచనలు గమనార్హం.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో కాజల్ ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా కీలక సూచనలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube