కరోనా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. ?

కరోనా ఈ పేరు వినగానే మళ్లీ భయపడే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తున్నాయి ప్రస్తుతం దేశంలో నెలకొంటున్న పరిస్దితులను చూస్తుంటే.ఇప్పటికే కరోనా విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిగా లేవంటూ మందలిస్తున్న కోర్టులు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నారంటూ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో అలహాబాద్ హైకోర్టు యూపీలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసితో పాటు లక్నో, గోరఖ్ పూర్, కాన్పుర్, ప్రయోగరాజ్‌లలో లాక్‌డౌన్ విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారిచేసింది.

 Allahabad, High Court, Sensational Decision, Corona Case, Up, Varanasi, Lucknow,-TeluguStop.com

కాగా ఏప్రిల్ 26 వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించింది.
ఇకపోతే దేశంలో కరోనా తీవ్రత వల్ల ఏ వార్త వినవలసి వస్తుందో అనే భయంలో ప్రజలు ముందుగానే సొంత గ్రామాలకు తరలి వెళ్లుతున్నారట.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రతుకుల్లో ఈ కోవిడ్ సెకండ్ వేవ్ మళ్లీ చీకట్లను నింపడం బాధాకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube