పవన్ కు రాజ్యసభ .. కుదిరితే కేంద్ర మంత్రి పదవి ? కానీ ..? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవసరం ఏమిటో ఇప్పుడు బిజెపి నేతలకు బాగా తెలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది.ఇటీవల జరిగిన తిరుపతి ఎన్నికలలో కాస్తోకూస్తో బీజేపీ ప్రభావం కనిపిస్తుంది అంటే,  అది జనసేన పుణ్యమే అని ఏపీ బిజెపి పెద్దలకు బాగా అర్థమైంది.

 Bjp Is Looking To Give Pawan Kalyan A Rajya Sabha Seat Or Union Minister , Janas-TeluguStop.com

గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించుకుని బిజెపి అభాసుపాలు అయింది.  కానీ ఈసారి వచ్చే ఎన్నికల ఫలితాలు కాస్త గౌరవప్రదంగా ఉంటాయనే నమ్మకం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

  జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళితేనే ఏపీలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని బిజెపి పెద్దలు నమ్మినట్లుగా కనిపిస్తున్నారు.తిరుపతి లోక్ సభ  ఉప ఎన్నికలలో గెలుపు పై పెద్దగా బిజెపి నేతలకు నమ్మకం లేకపోయినా , దాదాపు రెండున్నర లక్షలు ఓట్లు దక్కుతాయని అంచనా వేస్తోంది.

అదే జరిగితే ఏపీలో బీజేపీ బలపడేందుకు ఆస్కారం ఏర్పడుతుందని,  టిడిపి బలహీనం అవుతున్న క్రమంలో,  ఆ పార్టీ స్థానాన్ని తాము ఆక్రమించగల మని,  పవన్ సహకారంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి జనసేన కూటమి తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలను అనే నమ్మకం అప్పుడే బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

అందుకే పవన్ కు బాగా ప్రాధాన్యం పెంచాలని బిజెపి కేంద్ర పెద్దలు డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిజెపికి వచ్చే ఓటింగ్ శాతం ఆధారంగా,  పవన్ ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారట.దీనిలో భాగంగానే పవన్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు,  అవకాశాన్ని బట్టి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట.

పవన్ కు ఈవిధంగా ప్రాధాన్యం పెంచడం ద్వారా,  ఏపీలో జనసేన బిజెపి కూటమి మరింత బలపడుతుందని,  క్షేత్రస్థాయిలో దూసుకుపోతుందని,  పవన్ బిజెపి తరఫున ఏపీలో విస్తృతంగా పర్యటించి , అధికారం దక్కించుకునే అంతటి స్థాయిలో బలం పెంచుకోవాలని బీజేపీ నేతలు  చూస్తున్నారు.అయితే బిజెపి , జనసేన విడివిడిగా కాకుండా,  జనసేన ను బీజేపీ లో విలీనం చేయించి అప్పుడు ఈ పదవులు కట్టబెట్టాలని, అప్పుడే తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని , లేకపోతే తాము ఇచ్చే పదవుల ద్వారా జనసేన బలోపేతం అవుతుందని , ఆ బలం పెరిగిన తరువాత పవన్ తమను పట్టించుకోకపోతే మళ్లీ టిడిపి చేతిలో మోసపోయినట్లే జనసేన చేతిలోనూ మోస పోవాల్సి వస్తుందని ముందుగానే బిజెపి జాగ్రత్త పడుతోందట. 

Telugu Ap, Bjpjanasena, Bjp, Chandrababu, Jagan, Janasena, Pavan Cm, Pavan Kalya

అందుకే జనసేన విలీనం పై ఒత్తిడి పెంచాలని,  దానికి ఒప్పుకుంటే కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టి బిజెపి తరఫున పవన్ ను సీఎం అభ్యర్థిగా బిజెపి జాతీయ పెద్దల ద్వారానే చెప్పించాలనే ప్లాన్ లో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.మరి బిజెపి పెట్టే ప్రతిపాదనకు జనసేనని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube