నిరాహార దీక్షతో షర్మిల వేసిన వ్యూహం ఫలించిందా?

తెలంగాణలో ఏ మాత్రం ఎవరూ కూడా ఊహించకుండా ఎంట్రీ ఇచ్చి షర్మిల ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఆంధ్రా పెత్తనం పోవాలని చెప్పి రాష్ట్రం కోసం ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నది.

 Ys Sharmila Udyoga Deeksha Against Kcr Govt, Kcr, Ys Sharmila, Udyoga Deeksha, S-TeluguStop.com

ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాల తరువాత ఇప్పుడు మరల ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే ఏ తెలంగాణ వాది అంగీకరిస్తాడు.ఈ చిన్న లాజిక్ తెలియకుండా షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తుందని భావిస్తే మనం పొరపాటు పడ్డట్లే.

అయితే ఇప్పటికే తెలంగాణలో యాక్టివ్ గా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి ఉంది.అయితే షర్మిల తాజాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి 72 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తేలిసిందే.

అయితే ఈ దీక్షను ఎవరూ ఖాతరు చేయని పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలి అని పెద్ద ఎత్తున రకరకాల వర్గాల వారు పోరాటం చేస్తున్నారు.

అయితే ఈ అంశం మీద పోరాటం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మైలేజీ వస్తుందనే ఆలోచనతో అంతేకాక నిరాహార దీక్షకు కెసీఆర్ స్పందించి ఏదైనా శుభ వార్త చెబితే అది షర్మిల పోరాటం వల్లే నోటిఫికేషన్ విడుదల చేసిందని పెద్ద ఎత్తున ప్రకచారం చేసుకోవచ్చు అనే దీక్ష చేపట్టినా ప్రభుత్వం నుండి ఎవరు స్పందించలేదు.ఇక మొత్తంగా దీక్ష పేరుతో షర్మిల వేసిన వ్యూహం విఫయమైందనే చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube