వకీల్ సాబ్ నివేదాకు అన్యాయం చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదలై బాగానే కలెక్షన్లను రాబడుతోందని తెలుస్తోంది.ఈ సినిమాలో అన్యాయానికి గురైన యువతుల పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు.

 Actress Nivetha Thomas Not Getting Offers After Vakeel Saab Movie , Nivetha Thom-TeluguStop.com

ముగ్గురు యువతులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే వకీల్ సాబ్ సినిమా సక్సెస్ అంజలి, అనన్యలకు ప్లస్ అవుతుంటే నివేదాకు మాత్రం ప్లస్ కాకపోవడం గమనార్హం.

వకీల్ సాబ్ సినిమా తరువాత అంజలికి ఎఫ్ 3 సినిమాలో ఛాన్స్ దక్కింది.సోనాల్ చౌహాన్ చేయాల్సిన పాత్రలో అంజలికి ఛాన్స్ దక్కడంతో వకీల్ సాబ్ వల్ల అంజలి కెరీర్ పుంజుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాలో నటించిన అనన్య నాగళ్లకు సైతం చిన్న సినిమాల్లో ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.నివేదా థామస్ కు మాత్రం కొత్త సినిమా ఆఫర్లు పెద్దగా రావడం లేదని తెలుస్తోంది.

Telugu Anajli, Ananya Nagalla, Coronanivetha, Corona, Nivetha Thomas, Nivethatho

అంజలి, అనన్య వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే నివేదా థామస్ మాత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.ఫలితంగా ఈ సినిమా సక్సెస్ అయినా నివేదాకు కొత్త ఆఫర్లు రావడం లేదు.వకీల్ సాబ్ రిలీజ్ టైమ్ లో నివేదాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాకపోయి ఉంటే మాత్రం నివేదాకు కొత్త ఆఫర్లు వచ్చేవని చెప్పవచ్చు.ఒక విధంగా వకీల్ సాబ్ నివేదాకు మాత్రం అన్యాయం చేశాడనే చెప్పాలి.

వకీల్ సాబ్ విడుదల సమయంలో కరోనా నిర్ధారణ కావడం తన బ్యాడ్ లక్ అని నివేదా థామస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.నివేదా థామస్ గ్లామరస్ రోల్స్ పై ఆసక్తి చూపకపోవడంతో ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube