ఈ మాస్కులు వాడకపోతే కరోనా ఖాయం!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుంది.పలుచోట్ల వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 Use N95 Masks To Control Covid, N95 Mask, Corona, Corona Second Wave, Doctor Fah-TeluguStop.com

రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఈ తరుణంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజలపై వదిలేసారు.

ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలుచోట్ల కఠిన నిబంధనలు విధించారు.


కరోనా వైరస్ గత ఏడాది వ్యాప్తి చెందగా.

తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ రెండవ సారి వ్యాపిస్తుంది.ఇక ఈ వైరస్ పలు లక్షణాలతో సోకుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో ఉన్న కూడా మాస్క్ లను వాడాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.


Telugu Corona, Corona Wave, Covid Effect, Faheem Younus, Maskscontrol-Latest New

లాన్సెట్ అధ్యయనం లో డాక్టర్ ఫహీమ్ యూనస్ తెలిపిన ప్రకారం కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తుందని తెలిపారు.అంతేకాకుండా వీటికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్కులు కాకుండా ఎన్ 95 లేదా కే ఎన్ 95 మాస్కులు ధరించడం వల్ల మేలు ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా ఈ మాస్క్ లను ఒక్క రోజు ఒకటి వాడాలని తెలిపాడు.ఒకవేళ అవి పాడవ్వకపోతే మరుసటిరోజు వాడుకోవచ్చని తెలిపారు.కానీ బట్ట మాస్క్ ను మాత్రం వాడవద్దని తెలిపారు.


అంతేకాకుండా గాలి ద్వారా వస్తున్న ఈ వైరస్.

కేవలం బయట ఉన్న గాలిని మాత్రం కలుషితం ఎక్కువ చేయలేదంటూ.దీని అర్థం గాల్లోనే వైరస్ ఉండే అవకాశం ఉందని తెలిపాడు.

ఇక ఎక్కువ నాలుగు గోడల మధ్య ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుపగా, ఆరడుగుల దూరంతో పార్కులు, బీచ్ ల వద్ద మాస్క్ ధరించకుండా ఉన్నాకూడా సురక్షితమని తెలిపాడు.కానీ ఈ సమయంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అంటూ వైద్యులు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube