రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబో మూవీ జులై లేదా ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శంకర్ సూచన మేరకు ఈ సినిమా కోసం చరణ్ దాదాపుగా అయిదు నుండి పది కేజీల బరువు తగ్గబోతున్నాడట.బరువు తగ్గడం హీరోలకు పెద్ద సమస్య కాదు.కాని బరువు పెరిగే విషయంలోనే ఇబ్బంది ఉంటుంది.కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా సినిమా ను మొదలు పెట్టబోతున్నారు.ఈ లోపు చరణ్ తన బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టిన తర్వాత చరణ్ తన బరువు తగ్గాల్సి ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
చరణ్ ను అల్లూరి సీతారామ రాజుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చూడబోతున్న ప్రేక్షకులు ఆచార్య లో సిద్ద పాత్రలో చూడబోతున్నారు.ఈ రెండు పాత్రలకు పూర్తి విభిన్నంగా శంకర్ చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.అతి త్వరలోనే ఆ లుక్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే శంకర్ మరియు చరణ్ ల మద్య కథా చర్యలు పూర్తి అయ్యాయి.పాన్ ఇండియా మూవీ కనుక స్క్రిప్ట్ విషయంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో కూడా చర్చలు జరిపితే బాగుంటుందని దర్శక నిర్మాతలు దిల్ రాజు మరియు శంకర్ లు భావిస్తున్నారట.అందుకే బాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ తో ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
అతి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన సెట్స్ నిర్మాణం కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే ఏడాదిలోనే విడుదల చేస్తామని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.