సినిమాలు ఏమీ లేకున్నా 'వకీల్‌ సాబ్‌' సందడి కరువు

కరోనా సెకండ్‌ వేవ్ టాలీవుడ్‌ పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.గత ఏడాది దాదాపు 9 నెలల పాటు థియేటర్లు మూత పడి ఉన్నాయి.

 Corona Second Wave Effect On Pawan Kalyan Vakeel Saab Movie,latest  News-TeluguStop.com

ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి.ఒక్క నెలలోనే మునుపటి జోరు కనిపించింది.

మస్త్‌ జోష్ మీద టాలీవుడ్‌ ప్రేక్షకులు కనిపించడంతో వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి.మంచి సినిమా లకు మంచి వసూళ్లు దక్కాయి.

కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారనంగా మళ్లీ సినిమా ల విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు.భారీ అంచనాలున్న వకీల్‌ సాబ్‌ సినిమాకు మొదటి మూడు నాలుగు రోజులు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.

కాని ఆ తర్వాత నుండి వసూళ్ల విషయంలో నిర్మాత దిల్‌ రాజుకు నిరాశ తప్పలేదు.సరే ఈ వీకెండ్‌ లో అయినా వసూళ్లు నమోదు అవుతాయా అంటే అది కూడా లేదు అంటున్నారు.

వకీల్‌ సాబ్‌ సినిమా కు పోటీగా నిన్న శుక్రవారం సినిమా లు ఏమీ రాలేదు.అయినా కూడా శని ఆదివారాల్లో వకీల్ సాబ్ వసూళ్లు ఆశాజనకంగా లేవు.

ఎందుకంటే కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సాహసం చేయడం లేదు.కనుక వకీల్‌ సాబ్ సినిమా కు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న వకీల్‌ సాబ్‌ కు 80 కోట్ల వరకు షేర్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు.లాంగ్ రన్‌ లో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే ఖచ్చితంగా 130 కోట్ల రూపాయల వరకు షేర్‌ సాధించేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి వకీల్‌ సాబ్‌ విషయంలో అంచనాలు తలకిందులు అయ్యేలా కరోనా చేసిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.దిల్‌ రాజు ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

కాని మొత్తం నీరు గారి పోయిందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube