క్రిప్టోకరెన్సీపై నిషేధం వద్దు: భారత ప్రభుత్వానికి ఇద్దరు ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తల విజ్ఞప్తి

క్రిప్టోకరెన్సీ… ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డిజిటల్ లావాదేవీలకు చెలామణిలో ఉన్న మారకపు విలువ.అయితే భారత ప్రభుత్వం దీన్ని ఉపయోగించవద్దని గతంలోనే స్పష్టం చేసింది.

ఇప్పుడు అధికారికంగా నిషేధించడానికి పావులు కదుపుతోంది.ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకురానుంది.

క్రిప్టో కరెన్సీ ఉపయోగించే వారిపై జరిమానాలు లేదా డిజిటల్ ఆస్తులు కలిగి ఉన్నవారిపై రుసుములు విధించనుంది.అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా క్రిప్టోకరెన్సీని నిషేధించవద్దంటూ భారత సంతతికి చెందిన ఇద్దరు సింగపూర్ పారిశ్రామిక వేత్తలు కేంద్రప్రభుత్వాన్ని కోరారు.ఇటీవలే ఓ డిజిటల్ కళాకృతి కోసం 69.3 మిలియన్ డాలర్లను క్రిప్టోకరెన్సీ రూపంలో ఖర్చు చేసి సంచలనం సృష్టించిన విఘ్నేశ్ సుందరేశన్, ఆనంద్ వెంకటేశన్ ఈ విధమైన విజ్ఞప్తి చేశారు.వీరిద్దరూ బ్లాక్‌చైన్ టెక్నాలజీ కంపెనీని నడుపుతున్నారు.

విఘ్నేశ్ మాట్లాడుతూ.ప్రస్తుతం భారత్ వంటి కొన్ని దేశాలు క్రిప్టోకరెన్సీని నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు.

భారతీయులు క్రిప్టోకరెన్సీకి పోషకులుగా వుండే అవకాశం వుందని.అలాగే ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని విఘ్నేశ్ అన్నారు.

అసలేంటీ క్రిప్టోకరెన్సీ:

క్రిప్టో కరెన్సీ కూడా ఒకరకమైన డిజిటల్ కరెన్సీనే.కాకపోతే ఇది వర్చువల్ కరెన్సీ.

అయితే డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియత్రణ ఉంటుంది.డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి.

క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు.

డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి.క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి.బిట్ కాయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ప్రస్తుతం 8 మిలియన్ల పెట్టుబడుదారులు 100 బిలియన్ల రూపాయల క్రిప్టో పెట్టుబడులను కలిగి ఉన్నారు

Telugu Indianorigin, Ban Crypto, Crypto-Telugu NRI

క్రిప్టోకరెన్సీ సామాజ్రం విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై కొన్నేళ్ల క్రితం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.చర్చలు, ఆర్ధిక వ్యవస్థతో పాటు ట్రేడ్ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించిన ఈ ప్యానెల్ క్రిప్టోకరెన్సీపై నిషేధాన్ని సూచించింది.క్రిప్టోకరెన్సీ వల్ల సమస్యలు ఎదురవుతాయని తన నివేదికలో పేర్కొంది.క్రిప్టోకరెన్సీలు అసలు కరెన్సీలు కావని, వీటికి నిర్దిష్టమైన విలువ అంటూ ఏమీ ఉండదని వెల్లడించింది.అలాగే క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ అంటూ ఏమీ ఉండదని, ఇంకా ప్రభుత్వాల అజమాయిషీ కూడా ఉండదని వివరించింది.అందుకే క్రిప్టోకరెన్సీలను రద్దు చేయాలని సిఫారసు చేసింది.

దీనికి అనుగుణంగానే ఆర్‌బీఐ క్రిప్టోకరెన్సీపై నిషేధం విధించింది.బ్యాంకులు క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు దూరంగా ఉండాలని, ఎలాంటి సర్వీసులు అందించకూడదని ఆదేశించింది.

అయితే గతేడాది సుప్రీం కోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

అయితే దేశ ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని అధికారికంగా నిషేధించేందుకు చట్టాన్ని రూపొందించనుంది.

ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే క్రిప్టోకరెన్సీని నిషేధించిన మొదటి దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంటుంది.మైనింగ్, వాణిజ్యంపై నిషేధం విధించిన చైనా కూడా వీటిపై ఇంత వరకు ఇలాంటి నిషేధం తీసుకురాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube