నాగార్జున చెల్లిగా హాట్ హీరోయిన్.. ఎవరంటే?

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున నటన గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ స్టార్ హీరో గా నిలిచాడు.

 Regina As Nagarjuna Sister In Kalyan Jewellers Ad, Kalyan Jewellers Ad, Regina,-TeluguStop.com

ఒకప్పటి నుండి ఇప్పటివరకు తన నటనలో ఎటువంటి క్రేజ్ ను ఇప్పటివరకు కోల్పోలేదు.అంతేకాకుండా వయస్సు మీద పడిన కూడా ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిగా సినిమాలలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే నాగార్జున చెల్లిగా మరో హాట్ బ్యూటీ నటించింది తెలుసా.


నాగార్జున ఇప్పటికీ సినిమాలలో అవకాశాలను అందుకుంటున్నారు.

ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించలేదు.

ఇదిలా ఉంటే నాగార్జున చెల్లిగా హాట్ బ్యూటీ నటించింది.ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా.

అవును ఈ బ్యూటే నాగార్జున చెల్లెలిగా నటించింది.ఇంతకీ అదే సినిమా అనుకుంటున్నారా.


అది సినిమా కాదు.బుల్లితెర యాడ్ లో వీరిద్దరూ అన్నా చెల్లెలు గా నటించారు.అది కూడా కళ్యాణ్ జువెలర్స్ కోసం సరి కొత్త యాడ్ ని చేయగా.అందులో రెజీనా నాగార్జునకు చెల్లెలిగా నటించింది.అంతేకాకుండా ఈ యాడ్ లో మరో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయ బచ్చన్ కూడా నటించారు.


ఈ యాడ్ లో తన చెల్లెలు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతున్న సమయంలో బాధపడవద్దు అని నాగార్జున ఓదారుస్తాడు.

ఇక నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం అందరికి తెలిసిందే.ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ కి నాగార్జున ఇప్పటికే పలు ప్రకటనలను అందించగా.

తాజాగా ఈ ప్రకటనతో మళ్లీ నటించాడు.ఇక నాగార్జున ప్రస్తుతం బాలీవుడ్ ఓ సినిమా పూర్తి చేయగా.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెలుగులో మరో సినిమా చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube