రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. !

ఒక వైపు కోవిడ్ మరో వైపు అకస్మాత్తుగా కలిగే వాతావరణంలోని మార్పులు వెరసి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.ఇప్పడికే భానుడు భగభగమంటూ సెగలు పుట్టిస్తుంటే.

 Meteorological Department Warn People Of Telugu States , Meteorological Departme-TeluguStop.com

మరో వైపు కరోనా వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మండుతున్న ఎండలు మరింత సెగలు కక్కబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడిస్తున్నారు.

ఇందుకు కారణం విదర్భ నుంచి మరాట్వాడా వరకూ, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణులు కొనసాగుతుండటమే అని ఓ అధికారి వెల్లడించారు.

కాగా ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అదికూడా తగు జాగ్రత్తలు తీసుకుని అంటూ తెలిపారు.

ఇక ఈ ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube