ఏపీలో మాజీ మంత్రి కుటుంబం అరాచకం.. దళితులు ఓటు వేయకుండా అడ్డు.. ?

ఓటుహక్కు అనేది ఓటరుకు ఎంత అమూల్యమైనదో తెలిసిందే.ఇది ఆయుధం కంటే పదునైనది.

 Former Minister Bojjala Gopalakrishna Reddy Anarchy In Ap Elections , Ap, Former-TeluguStop.com

బహుశ తన జీవితంలో ఒక ఓటర్ ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలనేది, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ఎన్నికల్లో మాత్రమే జరుగుతుంది.ఆ తర్వాత అతని చేతిలో ఏం ఉండదు.

అంతా పాలకులే.అలాంటి ఓటును నేటికాలంలో ఎందరో దుర్వినియోగం చేస్తున్నారు.

ఇకపోతే ఏపీలోని రాజకీయాల రగడ గురించి తెలిసిందే.నిన్న జరిగిన ఊరందూరులో ఎన్నిక పోరులో దళితులను ఓటు హక్కు వినియోగించు కోకుండా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత ఊరు పెత్తందార్లు అడ్డుకున్నారట.

ఎస్టీ, ఎస్టీలే లక్ష్యంగా బొజ్జల సుధీర్‌రెడ్డి అనుచరులు శనివారం పోలింగ్‌ కేంద్రం వద్ద రచ్చ చేశారని, ఓటేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారని ప్రచారం జరుగుతుంది.

కాగా ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో విలీనం చేసినందుకు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు హకుం జారీ చేశారట.

ఈ మ్యాటర్ కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళడంతో వీరి సహకారంతో కాలనీకి చెందిన 12 మంది దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం.

ఇకపోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలో ఆరు గ్రామాలకు చెందిన ఎస్సీలను 35 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటన బయటకు రావడం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube