నోటి దుర్వాసన వేధిస్తోందా..అయితే జాజికాయే బెస్ట్ అప్ష‌న్!

చిన్న పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.ఇలాంటి వారు ప‌క్క‌న వారితో మాట్లాడేందుకే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.

 Nutmeg Helps To Reduce Bad Breath! Nutmeg, Reduce Bad Breath, Bad Breath, Benefi-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం, బ్యాక్టీరియా, నోటి ప‌రిశ్రుభ‌త లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను పోగొట్టుకునేందుకు ర‌క‌ర‌కాల పేస్టులు వాడ‌తారు.

ఎన్నో మౌత్ వాష్‌లు కూడా ఉప‌యోగిస్తారు.

అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుంటే ఎంత‌గానో కృంగిపోతుంటారు.

అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాల ద్వారానే నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా జాజికాయ ఈ సమ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

జాజికాయ‌ను వంట‌ల్లో రుచి మ‌రియు సువాస‌న కోసం వాడుతుంటారు.అయితే మంచి రుచి, సువాస‌న అందించ‌డ‌మే కాదు జాజికాయ‌లో పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.

ఎన్నో జ‌బ్బుల‌ను కూడా నివారిస్తుంది.

Telugu Bad Breath, Benefits Nutmeg, Tips, Latest, Nutmeg-Telugu Health - తె

ముఖ్యంగా నోటి దుర్వాస‌న స‌మ‌స్య ఉన్న వారికి జాజికాయ గ్రేట్‌గా స‌హాయ‌పడుతుంది.జాజికాయ‌ను పొడి చేసుకోవాలి.ఆ పొడిని వాట‌ర్‌లో వేసి మిక్స్ చేసుకుని ఆ వాట‌ర్‌తో నోటిని పుక్క‌లించాలి.

అలాగే ప్ర‌తి రోజు ఒక సారి జాజికాయ ముక్కను నములుతూ ర‌సాన్ని మింగేలి.ఇలా త‌ర‌చూ చేస్తూ ఉంటే జాజికాయ‌లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోట్లోని బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తుంది.

దాంతో నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఇక జాజికాయ‌తో నోటిని శుభ్రం చేసుకోవ‌డ‌మే కాదు డైట్‌లో చేర్చుకున్నా బోలెడు బెనిఫిట్స్ పొందొచ్చు.

జాజికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు క‌రుగుతాయి, గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది, అధిక ర‌క్త పోటు అదుపులోకి వ‌స్తుంది, మ‌తిమ‌రుపు త‌గ్గి జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.మ‌రియు చ‌ర్మ కాంతి కూడా పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube