హోరాహోరీగా టీఆర్ఎస్- కాంగ్రెస్. గెలిచి నిలిచేదెవరు?

తెలంగాణలో గత సంవత్సర కాలంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికలు వరుస పెట్టీ జరగడంతో ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

 Horahoriga Trs- Congress. Who Will Win And Stand,  Trs Party, Congress-TeluguStop.com

అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.నాగార్జున సాగర్ కాంగ్రెస్ కంచుకోట అయినప్పటికీ టీఆర్ఎస్ కు గట్టి బలం ఉన్న నియోజకవర్గం.

అయితే నేడు ఈ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.7 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన చరిత్ర ఉన్న జానారెడ్డికి, తండ్రి మరణంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నోముల భగత్ కు మధ్య పోటీ జరుగుతోంది.అయితే ఈ ఎన్నికను ఇటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మరి నాగార్జున సాగర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితులలో మరి ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

ఒకవేళ కాంగ్రెస్ పరాజయం పాలయితే ప్రజల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది.ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నాగార్జున సాగర్ లో ఓడిపోతే ఇక అన్నీ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పట్టు కోల్పోయిందనే సందేశం ప్రజల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube