గెలిస్తే ఆ రెడ్డి ... ఓడితే ఈ రెడ్డి ? ట్విస్ట్ గా మారిన పీసీసీ చీఫ్ ఎంపిక 

తెలంగాణ కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ ముందుకు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఏ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది.

 Janareddy And Revanth Reddy One Of Them Likely To Be The New Pcc President , Tel-TeluguStop.com

ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండడంతో,  తెలంగాణలో ఆ పార్టీ యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.చెప్పుకోవడానికి సీనియర్ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నా,  ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

ఒక పక్క అధికార పార్టీ టిఆర్ఎస్ ను బలంగా ఢీ కొట్టాలని చూస్తుండగ, బిజెపి సైతం ఆ రేసులోకి వచ్చేసింది.అలాగే కొత్తగా వైఎస్ షర్మిల సైతం పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉండడంతో,  కాంగ్రెస్ మరింత అప్రమత్తంగా అవుతోంది.

వీటన్నిటికీ దీటుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలి అంటే , కొత్తగా పిసిసి అధ్యక్షుడుని నియమించాలని,  అదొక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ను  ఆదుకునే అస్త్రం అని ,ఆ పార్టీ అధిష్టానం నమ్ముతోంది.

వాస్తవంగా ఫిబ్రవరిలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసినా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ పదవిని భర్తీ చేయవద్దంటూ నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడంతో, అప్పుడే ఆ పదవి ని భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ వెనకడుగు వేసింది.

ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల తంతు నేటితో మురిసిపోతోంది.దీంతో మళ్లీ పిసిసి అధ్యక్షుడి ఎంపిక సంబంధించి కసరత్తు మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో, ఇప్పటికే ఈ రేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , శ్రీధర్ బాబు, జానారెడ్డి ఎలా చాలామంది ఉన్నారు.

అయితే ఎక్కువగా రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండగా,  నాగార్జునసాగర్ ఎన్నికల్లో జానారెడ్డి కనుక గెలిస్తే,  ఆయనకే పిసిసి అధ్యక్ష పదవి అప్పగించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనే ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.

Telugu Jana Reddy, Komatireddy, Nagarjuna Sagar, Pcc, Revanth Reddy, Sridhar Bab

  అయితే జానారెడ్డి ఓటమి చెందితే మాత్రం రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.అందుకే  జానారెడ్డిని మచ్చిక చేసుకుని,  ఆయన ద్వారానే సీనియర్ల మద్దతు కూడగట్టుకొని , పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి  అభిప్రాయ పడుతున్నారు.దీనిలో భాగంగానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో జనా రెడ్డి గెలుపు కోసం రేవంత్ కష్ట పడుతూ ఉండడం వంటివి పిసిసి అధ్యక్ష పదవి సాధించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకే  ముందుగా ఈ విధంగా వ్యూహం పన్నినట్లు కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జానారెడ్డి ఆయన కాకపోతే రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube