నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ అభ్యర్థి..!!

నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.ఈ ఉప ఎన్నికల కోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది.

 Trs Candidate Who Exercised His Right To Vote In Nagarjunasagar By-election Poll-TeluguStop.com

దాదాపు 41 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.మొత్తం 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.సాయంత్రం ఆరు గంటల తర్వాత కరోనా పేషెంట్లకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది.

దీంతో ఉదయం నుండి పెద్ద ఎత్తున నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ లో భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొంటున్నారు.ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఇబ్రహీంపేట లో ఓ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో పాటు మే 2న నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది.గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోములకు 46.33 శాతం ఓట్లు పడ్డాయి.ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి గత ఎన్నికలలో 42.05 శాతం ఓట్లు రాబట్టారు.దాదాపు టిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికలలో పోటీ నెలకొన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube