ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఏపీ సర్కార్.. !

ఏపీ సీయం వైఏస్ జగన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు.కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని వెల్లడిస్తున్నారు.

 Aprtc Good News Retired Employees Apsrtc, Good News, Retired Employees, Ys Jagan-TeluguStop.com

ఇకపోతే ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ కార్మికులు అందవలసిన ప్రయోజనాలు అందక ఎప్పుడెప్పుడు వస్తాయా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు.ఈ నేపధ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది.

ఇకపోతే 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు బకాయిలో ఉన్నాయి.

కాగా ఏపీ సీఎం జగన్ ఆ మొత్తాలను కార్మికులకు చెల్లించాలని గతంలో అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరపిన అధికారులు ఆ మొత్తాన్ని ఏప్రిల్ చివరి నాటికి చెల్లించాలని నిర్ణయించారు.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube