ఏపీలో కరోనా వ్యాక్సిన్ రెమిడెసివిర్ ధర పై నిబంధనలు విధించిన సర్కారు.. !

అవినీతికి కేరాఫ్ చెప్పాలంటే మనదేశాన్ని చూపించవచ్చూ.ఇక్కడ మనుషుల శవాలతో కూడా దందా చేసే కల్తీనాయళ్లూ ఎక్కువగా కనిపిస్తారు.

 Ap Govt Restrictions On Remdesivir Injection Price, Ap Govt, Restrictions, 2500-TeluguStop.com

పక్కవాడు చస్తున్న పట్టించుకోకుండా కాసుల కోసం కక్కూర్తిపడే వారు ప్రతి సంస్దలో, రాజకీయాల్లో కూడా ఉన్నారు.

ఇకపోతే ఈ కరోనా దేశాన్ని పట్టి పీడించడం ఏంటో గానీ దీని సాకుగా చేసుకుని కోట్లల్లో అవినీతి జరుగుతుందట.

ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం విషయంలో జరుగుతున్న దోపిడి చూస్తే అర్ధం అవుతుంది.ఇక కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.100 ఎంజీ రెమిడెసివిర్ ధరను రూ.2,500 కు మించి అమ్మరాదని ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఏపీలో రెమిడెసివిర్ ఇంజక్షన్ స్టాక్స్ నిండుకుంటున్న సంగతి తెలిసిందే.దీంతో ఈ ఔషధానికి డిమాండ్ పెరిగి బ్లాక్ మార్కెట్ అవుతోందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న ఆసుపత్రులతో పాటు, ఈ సౌలభ్యం లేని ఆసుపత్రుల్లో కూడా రెమిడెసివిర్ కు రూ.2,500 మాత్రమే వసూలు చేయాలని, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube