ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక్క 'నో' బాల్ కూడా వేయని బౌలర్లు ఎంత మంది ఉన్నారు ?

ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రీడ క్రికెట్.క్రికెటర్లకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

 Cricketers Who Havent Throw Singe No Ball In Their Entire Career, Lance Gibbs,-TeluguStop.com

కొందరు తమ అభిమాన ఆటగాళ్లలను దేవుడిలా పొగుడుతారు.సచిన్ లాంటి ఆటగాడిని క్రికెట్ దేవుడు అంటారు.

అవన్నీ పక్కన పెడితే క్రికెట్ లో ఒకే బాల్ మ్యాచ్ రిజల్ట్ నే తారుమారు చేస్తుంది.ఒక్క ఎక్స్ ట్రా రన్ తో మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.ఒక్కోసారి నో బాల్, వైడ్ బాల్ పడతాయి.

అయితే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు నో బాల్ వేయని బౌలర్లు ఉన్నారు.అలాంటి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

లాన్స్ గిబ్స్

Telugu Dennis Lily, Ian Botham, Imran Khan, Kapil Dev, Lance Gibbs-Telugu Stop E

ఇతడు వెస్టిండీస్ బౌలర్.మంచి స్పిన్నర్.79 టెస్టులు 3 వన్డేలు ఆడాడు.తన క్రికెట్ కెరీర్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నో బాల్ వేయలేదు.300 వికెట్లు వేగంగా పడగొట్టిన బౌలర్ గా గిబ్స్ గుర్తింపు పొందాడు.

ఇయాన్ బోథమ్

Telugu Dennis Lily, Ian Botham, Imran Khan, Kapil Dev, Lance Gibbs-Telugu Stop E

ఇయాన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్.102 టెస్టులు, 116 వన్డేలు ఆడాడు.ఇతడు కూడా నో బాల్ వేయలేదు.

ఇమ్రాన్ ఖాన్

Telugu Dennis Lily, Ian Botham, Imran Khan, Kapil Dev, Lance Gibbs-Telugu Stop E

ఈ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ కూడా తన క్రికెట్ కెరీర్ లో నో బాల్ వేయలేదు.ఇతడు 88 టెస్టుటు, 175 వన్డేలు ఆడాడు.ప్రస్తుతం ఈయన పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నాడు.

డెన్నీసస్ లిల్లీ

Telugu Dennis Lily, Ian Botham, Imran Khan, Kapil Dev, Lance Gibbs-Telugu Stop E

ఇతడు ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్.మొత్తం 70 టెస్టులు 63 వన్డేలు ఆడాడు.తన కెరీర్లో సింగిల్ నో బాల్ వేయలేదు.

కపిల్ దేవ్

Telugu Dennis Lily, Ian Botham, Imran Khan, Kapil Dev, Lance Gibbs-Telugu Stop E

భారత్ కు తొలి వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన కెప్టెన్ కపిల్ దేవ్.ఈయన కెప్టెన్సీలోనే భారత జట్టు అన్ని రంగాల్లలో మంచి ప్రతిభ కనబర్చింది.మొత్త 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు.తన క్రికెట్ కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు.తన కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు కపిల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube