విజయ్ దేవరకొండ, సుకుమార్‌ మూవీ ఉన్నట్లా? లేనట్లా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

 Director Sukumar Next Movie Not With Vijay Devarakonda , Vijay Devarakonda, Suku-TeluguStop.com

ఇదే సమయంలో ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.విజయ్‌ దేవరకొండ మరియు సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రామ్‌ చరణ్‌ తో సుకుమార్‌ మూవీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయములో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ మరియు సుకుమార్‌ల సినిమా విషయంలో చర్చలు నిలిచి పోయాయి అనేది ఇక్కడ అందుతున్న సమాచారం.

సుకుమార్‌ పుష్ప సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కాకుండా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో సినిమా చేస్తాడని అంటున్నారు.

ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాని మెగా వర్గాల వారు మాత్రం చరణ్‌ మరియు సుకుమార్‌ సినిమా ను కన్ఫర్మ్‌ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు అంటే మాత్రం వారి వద్ద సమాధానం లేదు.ఎందుకంటే ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్ సినిమా లో చరణ్ నటిస్తున్నాడు.

మరో వైపు ఆచార్యలో కూడా నటిస్తున్నాడు.ఈ రెండు సినిమా ల తర్వాత శంకర్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఇప్పటికే చరణ్‌ డేట్లు ఇచ్చాడు.

ఈ ఏడాది జులై నుండి శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ మూవీ ఉంటుంది.కనీసం ఏడాది అయినా వీరి కాంబోలో మూవీ ఉంటుంది.

కనుక ఆ తర్వాత సుకుమార్‌ మూవీ ఉండే అవకాశం ఉంది.అంటే చరణ్‌ తో మూవీ కోసం కనీసం ఏడాది పాటు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

మరి అప్పటి వరకు సుకుమార్‌ వెయిట్‌ చేస్తాడా అంటే ఏమో అంటూ సమాధానం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube