రూ. 2 వేల కోసం 50 గుడ్లు తినే పందెం.. చివరకు..?!

సాధారణంగా మనము క్రికెట్ బెట్టింగ్ లు, ఆన్లైన్ బెట్టింగ్ లు చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా 2వేల రూపాయల కోసం కాసిన గుడ్ల పందెం చివరికి నిండు ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి.

 Uttarpradesh Man Lost His Life By Betting Of Eating Fifty Eggs For Two Thousand-TeluguStop.com

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఉత్తరప్రదేశ్లోని ఔన్‌ పూర్‌ లో సుభాష్ యాదవ్ అనే వ్యక్తి 2 వేల రూపాయల కోసం తన మిత్రుడితో పందెం వేశాడు.ఈ క్రమంలో 50 గుడ్లను ఆగకుండా ఒకేసారి తినేస్తానని బెట్ కాయడంతో, అతని స్నేహితులు సురేష్ యాదవ్ ముందు 50 గుడ్లు ఉంచడం.

దీనితో సుభాష్ యాదవ్ ఒక్కొక్కటిగా గుడ్లను తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.కానీ 42 వ గుడ్డు తింటున్న సమయంలో ఒక్కసారిగా సుభాష్ యాదవ్ కుప్పకూలిపోయాడు.వెంటనే అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా, కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది.

సుభాష్ యాదవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు.

వాస్తవానికి గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ సురేష్ యాదవ్ గుడ్లు తినడం వల్ల ఎలా చనిపోయాడు అనే కోణంలో వైద్య నిపుణులు పరిశోధనలు నిర్వహించగా, ఎక్కువ గుడ్లు తినడం వల్ల అతడి జీర్ణ వ్యవస్థ పై ఒత్తిడి పెరగడంతో, అలాగే గుడ్డులో లభించే పచ్చసొన అధిక కొవ్వు ఉండడంతో, గుండె పనితీరు నెమ్మదించి ప్రాణాలు విడిచినట్లు  వైద్యులు తెలియజేశారు.ఈ క్రమంలో చైనా లోని జెజియాంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ.

‘‘గుండె ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్డులోని తెల్ల సొన లేదా ఇతరాత్ర ప్రత్యామ్నాయ ప్రోటీన్లు తీసుకోవడమే ఉత్తమం అని మా పరిశోధనలో తెలేంది.ఎక్కువ మరణాలు కొవ్వు స్థాయిలు పెరగడం వల్లే చోటుచేసుకుంటున్నాయని తెలిసింది’’ ఆయన తెలియజేశారు.

అంతేకాకుండా గుడ్లు అతిగా తినే వారు తగ్గించుకోవడం మంచిదను సలహా ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube