వాట్సప్ ప్రైవసీ పాలసీకి మే 15 డెడ్‌లైన్..!

నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ లేరు.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరు వాట్సప్ వాడుతూనే ఉన్నారు.

 May 15 Deadline For Whatsapp Privacy Polic  Whatsup, Dead Line, May 15th, Privac-TeluguStop.com

ఇక వాట్సప్ వాడుకలోకి వచ్చిన దగ్గరి నుండి అనేక ఫీచర్స్ పుట్టుకొచ్చాయి.అయితే రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని ప్రకటించింది వాట్సప్.ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలి.ఇప్పటికే ఈ పాలసీని అంగీకరించినవారు చేయాల్సిందేమీ లేదు.కానీ ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజే గడువుంది.

అయితే ప్రైవసీ పాలసీ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే సందేహాలు యూజర్లను వెంటాడుతున్నాయి.ఇక వాట్సప్ కొత్త నియమనిబంధనలు అంగీకరించకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు.ఇక మే 15 నుడను 120రోజులు మాత్రమే వాట్సప్ పని చేస్తుందన్నారు.ఆ తర్వాత మీ అకౌంట్ లో ఛాట్స్, గ్రూప్స్ అన్ని పోతాయి.

అంతేకాక మీ వాట్సప్ కూడా పని చేయదు.

Telugu Line, Privacy Policy, Whatsup-Latest News - Telugu

ఒక్కవేళ మేరీ అదే నెంబర్ మీద వాట్సప్ క్రియేట్ చేయాలి అనుకుంటే మళ్ళి మొదటి నుండి చేయాల్సి వస్తుంది.ఇక అప్పుడు కూడా మీరు కొత్త నిబంధలను ఆగింకరించాల్సి వస్తుంది.ఆ ప్రైవసీ పాలసీ వివాదాస్పదం కావడంతో డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది.

ఆ తర్వాత ఫిబ్రవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించి 2021 మే 15 డెడ్‌లైన్‌గా విధించింది.గతంలో ప్రైవసీ పాలసీ వివాదాస్పదం కావడంతో యూజర్లకు వివరణ కూడా ఇచ్చింది.

అంతేకాదు యాజమాన్యం విషయాలు తెలిపింది.డేటా సెక్యూరిటీ, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ప్రైవసీ విషయంలో రాజీ పడట్లేదని తెలిపింది.

కానీ యూజర్ల డేటాను సేకరించడంతో పాటు థర్డ్ పార్టీ సంస్థలతో షేర్ చేసుకుంటామన్న నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వ్యాపారులతో ఛాట్ చేసేలా, ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునేలా మార్పులు చేస్తున్నామని, పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు డేటా షేర్ చేస్తామని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube