మహేష్ కి విలన్ గా మాధవన్ ని దించుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాకున్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి లాంచ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

 Madhavan As A Villain To Mahesh Babu, Tollywood, Trivikram Srinivas, Pooja Hegde-TeluguStop.com

ఇక ఈ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా ఇప్పటికే త్రివిక్రమ్ మొదలు పెట్టారని తెలుస్తుంది.ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి ప్రతినాయకుడుగా సౌత్ ఇండియా స్టార్ యాక్టర్ మాధవన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ముందుగా ఈ పాత్ర కోసం ఉపేంద్ర, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ని సంప్రదించిన కూడా వారి డేట్స్ ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాధవన్ ని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం మాధవన్ ఓ బయోపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అయితే మాధవన్ విలన్ గా ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేశారు.అందులో సవ్యశాచి ఒకటి కాగా, నిశ్శబ్దం సినిమా రెండోది.ఈ రెండు సినిమాలలో మాధవన్ పాత్ర చిత్రణ, పెర్ఫార్మెన్స్ భాగానే ఉన్నా కూడా సినిమాలో బలమైన కంటెంట్ లేకపోవడం వలన డిజాస్టర్ అయ్యాయి.ఈ నేపధ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకి కూడా ఆ సెంటిమెంట్ భయం పట్టుకుంది.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.అయితే మాధవన్ లాంటి నటుడు చేస్తేనే ఆ పాత్రకి న్యాయం చేసినట్లు అవుతుందని అతనినే తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube