నగర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళా.. ఎప్పుడంటే.. ?

తెలంగాణ నిరుద్యోగులకు ఒక తీపి వార్త.అదేమంటే నగర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందని, ప్రైవేట్‌ రంగంలో ఉచితంగా లభించే ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఖాదర్‌ జిలానీ పేర్కొంటున్నారు.

 Job Fair For Unemployed Youth Under The Favor Of City Police Department , Hydera-TeluguStop.com

కాబట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తున్నారు.ఈమేరకు మొత్తం 2500 ఉద్యోగాలు ఇచ్చేందుకు, 15 కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు.

ఇందులో భాగంగా పలు కంపెనీలు ఇంటర్వూలు చేయనున్నాయని, ఆయా విద్యార్థి విద్యార్హతతో పాటు నైపుణ్యత ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలుపుతున్నారు.

ఇకపోతే ఈ నెల 17న శనివారం ఫలక్‌నుమా జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్‌మేళా ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.

కావున అర్హత కలిగిన యువకులు పూర్తి సర్టిఫికెట్లతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఖాదర్‌ జిలానీ స్పష్టం చేశారు.ఇదే కాకుండా బస్తీల్లో సంచార వాహనం ద్వారా కూడా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube