nandamuri balakrishna photo in nagababu whatsapp dp,latest news viral

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో జవాబులు ఇస్తున్నారు.

 Nandamuri Balakrishna Photo In Nagababu Whatsapp Dp-TeluguStop.com

తాజాగా ఒక నెటిజన్ నాగబాబును వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్ లో ఎవరి ఫోటో పెట్టుకున్నారని ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు నాగబాబు సమాధానంగా బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ కలిసి దిగిన ఫోటో షేర్ చేయడం గమనార్హం.

అయితే నాగబాబు నిజంగా బాలకృష్ణ ఫోటో పెట్టుకున్నారో లేదో తెలియాల్సి ఉంది.

గతంలో ఒక సందర్భంగా తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని నాగబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బాలకృష్ణ ఫోటోనే నాగబాబు డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరొక నెటిజన్ నాగబాబుది లవ్ మ్యారేజా.? అరేంజ్డ్ మ్యారేజా.? అని ప్రశ్నించగా అరేంజ్డ్ మ్యారేడ్ అనే సమాధానం ఇచ్చారు.ఇష్టమైన ప్రదేశం గురించి నాగబాబు స్పందిస్తూ న్యూజిలాండ్ తనకు ఎంతో నచ్చుతుందని పేర్కొన్నారు.

బన్నీ ట్యాగ్ గురించి స్పందించిన నాగబాబు అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ బాగుంటుందని పేర్కొన్నారు.

సాయిధరమ్ తేజ్ గురించి చెప్పాలని ఒక నెటిజన్ కోరగా సాయిధరమ్ తేజ్ ఇన్నోసెంట్ అని హార్డ్ వర్క్ చేసే వ్యక్తి అని నాగబాబు పేర్కొన్నారు.నాగబాబు బాలకృష్ణ ఫోటోను వాట్సాప్ డీపీ అని చెప్పడంపై కొందరు నెటిజన్లు నాగబాబు కావాలనే వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు.

వేర్వేరు అంశాలపై నాగబాబు స్పందిస్తుండగా నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలలో కొన్ని అభిప్రాయాలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం.మరోవైపు నాగబాబు చేతిలో సినిమా ఆఫర్లు బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో అరవింద సమేత సినిమా నాగబాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube