కరోనా కొరల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం.. ఇక్కడికి రావద్దంటూ భక్తులకు విజ్ఞప్తి.. ?

ఇప్పటికే కరోనా వల్ల భక్తులకు ఆలయదర్శనాల్లో చోటు చేసుకున్న ఎన్నో మార్పుల వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతుండగా, కొన్ని పుణ్యక్షేత్రాల్లో అయితే కోవిడ్ విజృంభన వల్ల దర్శనాలు కూడా కలగడం లేదు.గత సంవత్సరం ఎక్కడికి వెల్లలేదని బాధపడుతున్న వారు కనీసం ఈ సంవత్సరం అయినా పుణ్యక్షేత్రాలను చూసివద్దామని భావించారు.

 Corona Cases Boom In Varanas Varanasi, Corona Virus, Cases Boom, Covid 19 , Inc-TeluguStop.com

కానీ ఈ సంవత్సరం కూడా ప్రజలకు ఆ భాగ్యం ఉన్నట్లుగా కనిపించడం లేదు.ఇకపోతే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వారణాసిలో కూడా కరోనా వైరస్ ప్రభలుతున్న నేపధ్యంలో ఇక్కడికి రావొద్దని జిల్లా అధికారులు పర్యాటకులకు, భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Boom, Corona, Covid, Varanasi-Latest News - Telugu

ఈ నేపథ్యంలో అధికారులు ఏప్రిల్‌లో వారణాసిని సందర్శించాలని ప్లాన్ చేసుకున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులు తమ ట్రిప్‌ను రద్దు చేసుకోవాలని కోరుతున్నారు.ఇదిలా ఉండగా గతనెల 31 న వారణాసిలో 116 కేసులు నమోదు కాగా ఏప్రిల్ 5 నాటికి అవి 550 కి పెరిగాయి.

ఇక బుధవారం వారణాసిలో 1,585 మందికి పాజిటివ్ తేలింది.గడిచిన రెండు వారాల్లోనే కొవిడ్ కేసులు భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నదని అధికారులు వివరించారు.ఇక ప్రస్తుతం వారణాసిలో 10,206 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube