న్యూస్ రౌండప్ టాప్ - 20

1.హైదరాబాద్ హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు

ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

 P And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold R-TeluguStop.com

2.తెలంగాణకు ఈ పంచాయతీ అవార్డు

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కు మరో జాతీయ అవార్డు లభించింది.

పంచాయతీ నిర్వహణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

3.మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వద్దు : టి పి సి సి

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయవద్దని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ని టిపిసిసి ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ కోరారు.

4.త్వరలో కొత్త రేషన్ కార్డులు : మంత్రి కేటీఆర్

Telugu Corona India, Mangoes Delhi, Ktr, Telangana, Gold, Top-Latest News - Telu

తెలంగాణలో అర్హులైన పేద ప్రజలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ లు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

5.’ గ్లైపో సెట్ ‘ ప్రమాదకరం నిషేధించండి

నేలను సర్వ నాశనం చేసే , పర్యావరణాన్ని విషతుల్యం చేసే .’ గ్లైపో సెట్ ‘ ను నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వానికి వ్యవసాాాాయ శాఖ ప్రతిపాదనలు పంపించింది.

6.గ్రావిటీ కాలువలో పడి దుప్పి మృతి

కాలేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్ నుంచి సరస్వతి లోని నీటిని తరలించే గ్రావిటీ కాలువలో పడి ఓ దుప్పి మృతి చెందింది.

7.తిరుమల సమాచారం

Telugu Corona India, Mangoes Delhi, Ktr, Telangana, Gold, Top-Latest News - Telu

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.బుధవారం శ్రీవారిని 29,863 మంది భక్తులు దర్శించుకున్నారు.

8.485 రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మూడు రాజధానులు కి వ్యతిరేకంగా అమరావతి రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు చేపట్టిన నిరసన దీక్షలు 485 వ రోజుకు చేరుకున్నాయి.

9.కత్తి పద్మారావు నేడు లోక్ నాయక్ పురస్కారం

కవి , రచయిత, హేతువాది, దళిత ఉద్యమ నాయకుడు డాక్టర్ కత్తి పద్మారావుకు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ లోని కళాభారతి ఆడిటోరియంలో లోక్ నయక్ ఫౌండేషన్ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు  ఆ పౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.

10.ఢిల్లీకి ఉత్తరాంధ్ర మామిడి

Telugu Corona India, Mangoes Delhi, Ktr, Telangana, Gold, Top-Latest News - Telu

ఉత్తరాంధ్ర నుంచి ఢిల్లీకి మామిడికాయలు ఎగుమతి ప్రారంభమైంది.కరోనా నేపథ్యంలో గూడ్స్ రైళ్లను కాకుండా , పాసింజర్ బోగీలను వీటికి కేటాయించారు.

11.శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిఐడి తనిఖీలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగో రోజున సిఐడి తనిఖీలు కొనసాగాయి.2015 – 2018 మధ్యలో మంజూరైన పరికరాలు ఇతర సామాగ్రి నిర్వహణ క్షేత్రస్థాయిలో వాటి లభ్యత ఆధారంగా అధికారులు తనిఖీ చేశారు.

12.తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది.ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో ఆమెను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు.

13 .ఎనిమిది కోట్ల విలువైన క్రేన్ లారీ దగ్ధం

తమిళనాడులోని సేలం జిల్లా వాళప్పాడి జాతీయ రహదారి వద్ద మంగళవారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది కోట్ల విలువైన భారీ క్రేన్ దగ్ధమైంది.

14.కాశీయాత్ర చేయాలంటే ఆర్టి పిసియార్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి

కాశీయాత్ర చేయాలంటే ఆర్టి పిసియార్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ మీడియాకు తెలిపారు.

15.మిషన్ ‘ఆహార క్రాంతి’ ప్రారంభం

Telugu Corona India, Mangoes Delhi, Ktr, Telangana, Gold, Top-Latest News - Telu

దేశ ప్రజల్లో పౌష్టికాహారం పై అవగాహన పెంచేందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.మిషన్ ఆహార క్రాంతి పేరిట ఉత్తమ ఆహారం, కొత్త ఆలోచన నినాదంతో అనేక సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

16.తోషిబా సీఈవో రాజీనామా

పారిశ్రామిక దిగ్గజం తోషిబా సీఈవో నబౌకి కురుమాతని నేడు తన పదవికి రాజీనామా చేశారు.

17.బెంగాల్ లో అఖిలపక్ష భేటీకి ఈసి పిలుపు

బెంగాల్ శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కలకత్తా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి  పిలుపునిచ్చింది.

18.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో  మొత్తం 4,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.సీబీ ఎస్ ఈ 10 వ తరగతి పరీక్షల రద్దు

Telugu Corona India, Mangoes Delhi, Ktr, Telangana, Gold, Top-Latest News - Telu

మే 4 నుంచి జరగాల్సిన సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది.అలాగే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

20.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 3,307 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

21.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,860

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,860.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube